ETV Bharat / international

'ఇమ్రాన్​ను తొలగించేందుకు ఆర్మీ అనుమతి అక్కర్లేదు'

పాకిస్థాన్​ అధికార పార్టీ టెహ్రీక్-ఇ-ఇన్సాఫ్​ను గద్దె దింపేందుకు తమకు ఆర్మీ అనుమతి అక్కర్లేదన్నారు పాకిస్థాన్​ ముస్లిం లీగ్​ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలు మర్యమ్ నవాజ్​. పార్టీ సమావేశానికి హాజరైన మర్యమ్​... ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​పై పలు విమర్శలు చేశారు.

Don't need army's support to overthrow Imran Khan, says Maryam Nawaz
'ఇమ్రాన్​ ఖాన్​ను తొలగించేందుకు ఆర్మీ అనుమతి అక్కర్లేదు'
author img

By

Published : Dec 27, 2020, 10:18 AM IST

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​పై విమర్శలు గుప్పించారు పాకిస్థాన్​ ముస్లిం లీగ్​ నవాజ్ ఉపాధ్యక్షురాలు మర్యమ్​ నవాజ్. ఖాన్​ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు తమకు ఆర్మీ అనుమతితో పనిలేదని వ్యాఖ్యానించారు. సింధ్​లో జరిగిన పార్టీ సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

" ఖాన్​ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలకు పాకిస్థాన్​ ఆర్మీ అనుమతి అక్కర్లేదు. మాకు ప్రజల మద్దతు ఉంది. అంతర్గతంగా జరుగుతోన్న వివాదాల విషయంలో ఇమ్రాన్​ ఖాన్​ ఓ కీలుబొమ్మ".

-మర్యమ్ నవాజ్, పీఎమ్ఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు.

ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ పాకిస్థాన్​ ఆర్మీ ఆధిపత్యం చలాయిస్తోందని, దేశంలో రాజకీయ, ఆర్థిక మార్పులకు కారణవుతోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు గతంలోనూ ఆందోళన చేశాయి. ఈ మేరకు 11 పార్టీల కూటమి పాకిస్థాన్​ డెమొక్రటిక్ మూమెంట్ (పీడీఎమ్) ఖాన్​ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు యత్నిస్తోంది. 2021 జనవరి కల్లా పాకిస్థాన్​ టెహ్​రీక్​-ఇ- ఇన్సాఫ్​ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్​ చేస్తోంది.

ఇదీ చదవండి:నేపాల్​ రాజకీయాల్లో మరోసారి చైనా జోక్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.