ETV Bharat / international

'అభినందన్​ విషయంలో రహస్యాలన్నీ నాకు తెలుసు' - pakisthan vs bharat

పాకిస్థాన్​ ప్రభుత్వం నుంచి తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు ఆ దేశ ప్రతిపక్ష నేత అయాజ్​ సాదిఖ్​. అభినందన్​ వర్ధమాన్​ విషయంలో తన మాటలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. తాను బాధ్యతారహితంగా మాట్లాడలేదని పేర్కొన్నారు.

Despite facing flak over statement on Abhinandan, Ayaz Sadiq says he stands by it
'అభినందన్​ విషయంలో.. రహస్యాలన్నీ నాకు తెలుసు'
author img

By

Published : Nov 1, 2020, 6:30 AM IST

అభినందన్​ వర్ధమాన్​ విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు పీఎంఎల్​-ఎన్ పార్టీ నేత, ఎంపీ అయాజ్​ సాదిఖ్​. అన్ని రహస్యాలు తనకు తెలుసునని అన్నారు. కానీ, తానెప్పుడూ బాధ్యతారహితంగా మాట్లాడలేదని చెప్పారు.

'అభినందన్​ను నిర్బంధించినప్పుడు పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్​ ఖామర్​ జావేద్​ బాజ్వా కాళ్లు వణికిపోయాయని' ఇటీవల వ్యాఖ్యానించారు సాదిఖ్. దీనిపై పాకిస్థాన్​ ప్రభుత్వం నుంచి, ఆ దేశ ఆర్మీ నుంచి ఆయన​ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సాదిఖ్​ తన వ్యాఖ్యలను సరిచేసుకోవాలని ఆ దేశ ఇంటర్​-సర్వీసెస్​ పబ్లిక్​ రిలేషన్​ చీఫ్​ జనరల్​ బాబర్​ ఇఫ్తేకర్​ హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే.. తన వద్ద చాలా రహస్యాలున్నాయని తెలిపారు పాక్​ ఎంపీ.

"ఇవన్నీ రాజకీయ భేదాలు. నా మాటలను సాయుధ బలగాలతో ముడిపెట్టడం సరికాదు. భారతీయ మీడియా చేతిలో​ ప్రభుత్వం కీలు బొమ్మలా మారింది. పాకిస్థాన్​కు మీరు న్యాయం చేయలేదు. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. నాకు చాలా రహస్యాలు తెలుసు. జాతీయ భద్రతా కమిటీకి నేను నాయకత్వం వహించాను."

--అయాజ్​ సాదిఖ్​, పాకిస్థాన్​ ప్రతిపక్ష నేత.

సాదిఖ్​ వ్యాఖ్యలు క్షమార్హం కానివని ఆ దేశ ఐటీ మంత్రి షిబిలి ఫరాజ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని తక్కువ చేసి మాట్లాడిన అయాజ్​కు, ఆయన అనుచరులకు తప్పక శిక్ష పడుతుందని అన్నారు.

అభినందన్​ విడుదల కోసం తమపై ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టం చేసింది పాక్​ సర్కారు. శాంతి సుహృద్భావ చర్యల్లో భాగంగానే ఆయనను విడుదల చేసినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:'పుల్వామా'పై మాట మార్చిన పాక్‌ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.