ETV Bharat / international

Mullah Baradar: ప్రభుత్వ కూర్పు నచ్చకే బరాదర్‌ అజ్ఞాతవాసం!

అఫ్గాన్​ తాలిబన్ల ప్రభుత్వంలో(Taliban Government) ఉప ప్రధానిగా నియామకం పొందిన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు(Mullah Baradar).. మంత్రివర్గంలో హక్కానీలకు ముఖ్య పాత్ర లభించడం ఏమాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయమై హక్కానీలతో(Haqqani Afghanistan) బరాదర్‌కు మాటల యుద్ధం జరిగిందని, మనస్తాపానికి గురైన ఆయన కాబుల్‌ను విడిచి వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Mullah Baradar
ముల్లా బరాదర్​
author img

By

Published : Sep 15, 2021, 6:39 AM IST

అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని(Taliban Government) ఏర్పాటు చేసుకున్నారు. తాలిబన్ల ముఠాలో శక్తిమంతమైన విభాగానికి అధినేతగా పనిచేసిన ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ను ప్రధానమంత్రిగా(Afghanistan Prime Minister) నియమించారు. మంత్రివర్గంలో హక్కానీలకు(Haqqani Afghanistan) ముఖ్య పాత్ర లభించింది. అయితే ఉప ప్రధానిగా నియామకం పొందిన తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు(Mullah Baradar) ఈ తరహా ప్రభుత్వ కూర్పు ఏమాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయమై హక్కానీలతో బరాదర్‌కు మాటల యుద్ధం జరిగిందని, మనస్తాపానికి గురైన ఆయన కాబుల్‌ను విడిచి వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ ఆడియో మెసేజ్‌ ద్వారా..

అఫ్గాన్‌ ఉపప్రధాని అబ్దుల్‌ ఘనీ బరాదర్‌(Mullah Baradar) కొద్దిరోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. సమావేశాలకు, ప్రెస్‌మీట్లకు హాజరుకావడంలేదు. తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా జరిగిన ఘర్షణలో బరాదర్ గాయపడి, అనంతరం మరణించినట్లు స్థానిక మీడియాలో పలు వార్తలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. తనకేమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు ఓ ఆడియో మెసేజ్‌ ద్వారా వెల్లడించించారు. అయితే ప్రభుత్వంలో హక్కానీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం నచ్చని బరాదర్‌ అసంతృప్తితో కాందహార్‌కు వెళ్లి అక్కడ అజ్ఞాతంలో ఉంటున్నట్లు సమాచారం.

పావులు కదిపారు..

హమీద్‌ కర్జాయ్‌, అబ్దుల్లా అబ్దుల్లా వంటి తాలిబానేతర నేతలకు ప్రభుత్వంలో(Taliban Government) ప్రాధాన్యం ఇస్తామని దోహా బృందం ఇదివరకే ప్రకటించింది. తమ ప్రభుత్వ ఏర్పాటులో ఇతర దేశాలు జోక్యం చేసుకోబోవని పేర్కొంది. అయితే ఇది సాధ్యం కాలేదు. ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్థాన్‌ కలుగజేసుకొంది. పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ అహ్మద్‌ అఫ్గాన్‌కు వెళ్లి.. అక్కడి ప్రభుత్వ ఏర్పాటులో పావులు కదిపారు. ప్రధాన శాఖలు హక్కానీలకు(Haqqani Afghanistan) కేటాయించేలా మంతనాలు చేశారు. దీంతో హమీద్‌ కర్జాయ్‌, అబ్దుల్లా అబ్దుల్లా నేతలకు చోటు దక్కలేదు. ఈ విషయంలో పాక్‌ జోక్యంపై దోహా బృందం సైతం అసంతృప్తిగానే ఉంది. బరాదర్‌(Mullah Baradar) సైతం ఇదే విషయమై మనస్తాపానికి గురైనట్లు సమాచారం. హక్కానీలతో ఆయనకు ఈ విషయమై గొడవ కూడా జరిగిందట. దీంతో అలక వహించిన బరాదర్‌.. ఎవరికీ చెప్పకుండా కాందహార్‌ వెళ్లిపోయాడని సమాచారం.

ఇదీ చూడండి: 'ఎలాంటి దాడులు చేయం.. ఉగ్రసంస్థలతో జట్టు కట్టం'

ఇదీ చూడండి: ఒకప్పుడు ఖైదీలు.. ఇప్పుడదే జైలుకు బాస్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.