ఉత్తర చైనా- షాంక్సీ రాష్ట్రం జియాంగ్ఫెన్ కౌంటీలో రెస్టారెంట్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
రెస్టారెంట్లో ఓ 80 ఏళ్ల వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా.. అక్కడ జరిగే విందుకు బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరయ్యారు. అదే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 57 మందిని వెలికితీశారు. ఇందులో ఏడుగురు తీవ్రంగా గాయపడగా మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!