ETV Bharat / international

మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్​ - US

అమెరికా దిగుమతులపై భారత్​ పెంచిన సుంకాలు తగ్గించాల్సిందేనని పేర్కొన్న ఒకరోజు వ్యవధిలోనే మెత్తబడ్డారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. జపాన్​లో మోదీతో భేటీ సందర్భంగా వాణిజ్యపరంగా నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకరించారు.

మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్​
author img

By

Published : Jun 28, 2019, 12:50 PM IST

Updated : Jun 28, 2019, 3:22 PM IST

మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్​

అమెరికా ఉత్పత్తులపై పెంచిన సుంకాలను భారత్ తగ్గించాల్సిందేనని హెచ్చరించిన ఒక్క రోజు వ్యవధిలోనే వెనక్కి తగ్గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. జపాన్​లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. వాణిజ్య పరంగా నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకరించారు.

జీ-20 సదస్సుకు బయలుదేరేముందు భారత్​ను హెచ్చరిస్తూ ట్వీట్​ చేశారు ట్రంప్​. అమెరికా దిగుమతులపై భారత్​ పెంచిన సుంకాలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. భారత్​ అధిక సుంకాలు వసూలు చేయడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

ఇరు దేశాధినేతల భేటీపై పలు అంశాలను వెల్లడించారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్​ గోఖలే.

"భారత్​కు 'సాధారణ ప్రాధాన్య దేశం'(జీఎస్​పీ) కింద ఇచ్చే హోదా రద్దు చేసిన అనంతరం మేము కొన్ని చర్యలు తీసుకున్నామని ప్రధాని ప్రస్తావించారు. ఆ​ చర్యలు ఇప్పటికే జరిగిపోయిన అంశమని తెలిపారు. ప్రస్తుతం భవిష్యత్తు కార్యచరణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ సమస్యలను ఏవింధంగా పరిష్కరించాలనేది మనం ఆలోచించాలని ట్రంప్​తో ప్రధాని చెప్పారు. ఈ ఆలోచనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ అంగీకారం తెలిపారు."
- విజయ్​ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి.

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికారం చేప్పటినందుకు మోదీకి అభినందనలు తెలిపారు ట్రంప్​. రక్షణ రంగంతో పాటు పలు కీలక అంశాల్లో భారత్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: జీ-20: మోదీ-ట్రంప్​ '5జీ' స్నేహగీతం

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 28 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0049: US TX Bridge Protest AP Clients Only 4217954
Bishop of El Paso marches to Mexico in protest
AP-APTN-0038: Japan G20 Putin AP Clients Only 4217953
Putin arrives for G20 summit in Osaka
AP-APTN-0036: Japan Trump Abe Bilat AP Clients Only 4217952
Trump meets Japanese PM Abe at G20
AP-APTN-0014: Japan G20 US Japan AP Clients Only 4217951
Trump and Abe hold bilateral meeting at G20
AP-APTN-2325: Cuba Rum AP Clients Only 4217945
Cuban-Norweigan partnership's new Cuban rum
AP-APTN-2324: Mexico Migrant Bodies Departure AP Clients Only 4217944
Bodies of drowned father, daughter leave Matamoros
AP-APTN-2320: US FL ORourke Booker Homestead AP Clients Only;Must credit WSVN-TV; No access Miami market 4217943
US Democratic hopefuls visit child migrant camp
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 28, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.