ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కొవిడ్-19 మహమ్మారి. ఈ ప్రాణంతక మహమ్మారి ధాటికి పలు దేశాల విమానాశ్రయాలు మూతపడ్డాయి. తీరంలోకి వచ్చిన నౌకలోని వారిని కొవిడ్ భయాందోళనలతో భూభాగంలోకి అనుమతించడం లేదు పలుదేశాలు. ఇదే పరిస్థితి మిస్టర్ వెస్టర్డామ్ ఓడకూ ఎదురైంది. వరుసగా జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ దేశాలు తమ భూభాగంలోకి అనుమతి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ప్రమాదమని తెలిసినా వెస్టర్డామ్ తమ తీరంలోకి రావొచ్చంటూ ఆహ్వానం పలికి తన పెద్దమనసు చాటుకుంది కంబోడియా. రెండు వారాల ప్రయాస అనంతరం సిహానౌక్ విల్లే నౌకాశ్రయానికి చేరుకుంది నౌక.
ముందుగా వైద్య బృందాలను పంపి వైద్యపరీక్షలు చేయించిన అనంతరం వారి భూభాగంలోకి అనుమతించింది. అయితే ఓడలోని 20మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని వారిని మిగతా వారికి దూరంగా ఉంచి చికిత్స అందించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమరులకు 'స్మారక చిహ్నం'