ETV Bharat / international

కరోనాపై పోరులో దక్షిణ కొరియా నేర్పే పాఠాలెన్నో...

author img

By

Published : Mar 11, 2020, 7:37 PM IST

కరోనా వైరస్​కు కేంద్ర బిందువైన చైనా తర్వాత అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అయితే.. ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితులు కనిపించటం లేదు. వైరస్​ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇతర దేశాలతో పోల్చితే అతి తక్కువ మరణాల రేటు నమోదవుతోంది. ఇంతకీ అక్కడ చేపడుతున్న చర్యలేంటి? దక్షిణ కొరియాను ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకోవచ్చా?

Coronavirus
కరోనాపై పోరులో దక్షిణ కొరియా నేర్పే పాఠాలెన్నో...

దక్షిణ కొరియా.. కరోనా వల్ల చైనా తర్వాత అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటి. దేశవ్యాప్తంగా 7,755 మంది వైరస్ బారిన పడ్డారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాలుగో స్థానంలో ఉంది. కానీ.. మరణాల సంఖ్య 60 మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సగటు మరణాలకన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్​ కట్టడికి దక్షిణ కొరియా తీసుకున్న చర్యలేంటి? ఆ దేశం అమలు చేసిన వ్యూహాన్ని ఓ పాఠంగా పరిగణించవచ్చా?

వైరస్​ను దక్షిణ కొరియా ఎలా కట్టడి చేస్తోంది?

చైనాలా వైరస్​ ప్రభావిత నగరాలను మూసివేయడానికి బదులుగా.. దక్షిణ కొరియా బహిరంగంగా సమాచారం అందించటం, ప్రజలను భాగస్వాములను చేయటం, విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టింది. కరోనా బారిన పడిన ప్రతి ఒక్క రోగి ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటూ.. వారికి పరీక్షలు నిర్వహిస్తోంది.

వైరస్​ బాధితులను 14 రోజుల పాటు వారు చేసే పనుల ద్వారా పరిశీలన చేస్తున్నారు అధికారులు. అందులో క్రెడిట్​ కార్డుల వాడకం, సీసీటీవీ ఫుటేజ్​, మొబైల్​ ఫోన్​ ట్రాకింగ్​ వంటివి ఉన్నాయి. ఆ సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్​సైట్లలో పెడుతున్నారు. కొత్త కేసు వచ్చిన ప్రాంతాలకు సంక్షిప్త సందేశం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 134 అమెరికన్​ డాలర్లు ఖర్చు అయ్యే పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టే చర్యలతో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదమున్నా... ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదు. పరీక్షలు చేయించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తద్వారా వైరస్​ను త్వరగా గుర్తించి.. వ్యాప్తిని అరికట్టగలుగుతున్నామని చెబుతున్నారు అధికారులు.

అంతమందికి పరీక్షలు ఎలా?

ఇతర దేశాలతో పోల్చితే వేగంగా పరీక్షలు జరిపిస్తోంది దక్షిణ కొరియా. ప్రతి రోజు 15 వేలకుపైగా నమూనాలను పరీక్షిస్తోంది. ఇప్పటి వరకు 2,20,000 మందికి పరీక్షలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 500కుపైగా ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు.

2015లో వ్యాప్తి చెందిన మెర్స్ (ఎమ్​ఈఆర్​ఎస్​)​ వైరస్​ సమయంలో పరీక్ష కిట్లు లేక దక్షిణ కొరియా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. నాడు నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు పక్కాగా అమలు చేస్తోంది. కేవలం 6 గంటల్లోనే ఫలితాలను వెల్లడించే కోవిడ్​-19 పరీక్ష కిట్లు సమకూర్చుకుంది. వాటిని దేశంలోని అన్ని ప్రయోగ కేంద్రాలకు పంపిణీ చేసింది.

ప్రజల సహకారం ఎలా ఉంది?

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. సమావేశాలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. ఫలితంగా... ఎప్పుడూ రద్దీగా ఉండే సియోల్​ నగరంలోని రెస్టారెంట్లు, దుకాణాలు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.

కే-పాప్ కచేరీల నుంచి పలు క్రీడల నిర్వహణను రద్దు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ సూచనలతో చాలా వరకు ప్రజలు మాస్కులను ధరించారు. దక్షిణ కొరియా ప్రజాస్వామ్య దేశం కానీ.. క్రమశిక్షణ కలిగిన సమాజం కలిగి ఉంది. దీనిని పలువురు విశ్లేషకులు ఒక కారణంగా చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో అధికారంలోని ప్రభుత్వ సలహాలు, సూచనలను కొంత మంది తిరస్కరిస్తారు. కానీ ఇక్కడ అలా లేదు.

మరణాల రేటు అంత తక్కువ ఎందుకు?

దక్షిణ కొరియాలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాల సగటు 3.4 శాతంగా ఉండగా ఇక్కడ 0.77 శాతమే. అందుకు ప్రధాన కారణం వైరస్​ను తొందరగా గుర్తించి సరైన చికిత్స అందించటమే.

దక్షిణ కొరియాలో ఎక్కువగా మహిళలు, 40 ఏళ్లలోపు వారే ఈ వైరస్​ బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్ధరణ అయిన కేసుల్లో సుమారు 60 శాతం కేసులు షిన్చోంజి చర్చ్ ఆఫ్​ జీసస్​తో ముడిపడివున్నాయి. అక్కడ ఎక్కువగా 30 ఏళ్లలోపు మహిళలే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలను పరిశీలిస్తే.. ఎక్కువగా ముసలివారు, మగవారిలోనే సంభవిస్తున్నాయి.

దక్షిణ కొరియాను ఉదాహరణగా చూడాలా?

జపాన్​లో సుమారు 600 మంది వైరస్​ బారిన పడితే అందులో 12 మంది మరణించారు. వైరస్​ పరీక్షలను అందరికీ అందుబాటులోకి తేలేకపోవటం వల్లే మరణాలు ఎక్కువగా ఉన్నాయని, దక్షిణ కొరియా చేపట్టిన చర్యల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు టోక్యోకు చెందిన మెడికల్​ పరిశోధన సంస్థ అధినేత మసహిరో కామి. పరీక్షలు నిర్వహించటం అనేది వైరస్​ను కట్టడి చేసే ప్రక్రియలో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.

"దక్షిణ కొరియా ప్రతి దేశానికి మంచి నమూనా, కొరియా వేగంగా చర్యలు చేపట్టింది" అని ప్రశంసించారు న్యూసౌత్​వేల్స్​ విశ్వవిద్యాలయానికి చెందిన మెక్​లాస్.

ఇదీ చూడండి: కరోనాపై యుద్ధం కోసం రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.