ETV Bharat / international

రష్యా, పాకిస్థాన్​లో రికార్డుస్థాయి కరోనా కేసులు - కరోనాా వైరస్ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆసియాలోనూ క్రమంగా పంజా విసురుతోంది. రష్యాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇవాళ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. సింగపూర్​, పాకిస్థాన్​లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

corona virus
ఆసియాలో మహమ్మారి విజృంభణ
author img

By

Published : May 1, 2020, 8:23 PM IST

Updated : May 1, 2020, 8:43 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా విలయ తాండవం ఆగడం లేదు. ఇప్పటి మొత్తం 33లక్షల 30వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 2లక్షల 30వేలు దాటింది. మొత్తం 10.53లక్షల మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. అమెరికాలో కరోనా కేసులు 11లక్షలకు చేరువలో ఉన్నాయి.

రష్యాలో నెమ్మదిగా మొదలైన కరోనా వైరస్​ వ్యాప్తి క్రమంగా పుంజుకుంది. దేశవ్యాప్తంగా శుక్రవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే దాదాపు 8 వేల మంది వైరస్ బారిన పడ్డారు.

ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,14,431కి పెరిగింది. అయితే రష్యాలో నిర్ధరణ పరీక్షల రేటు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫలితాల్లోనూ 70-80 శాతం కచ్చితత్వం నమోదవుతోందని సమాచారం. ఆ దేశంలో గణాంకాలకు మించి కేసులు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తన్నారు.

రష్యాలోని 5 ప్రాంతాల్లో న్యూమోనియా కేసులు పెరుగుతున్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. మాస్కోలో చాలా వైరస్​ కేసుల్లో ఇదే జరుగుతోందని చెబుతున్నారు. రష్యా ప్రధాని మిఖాయిల్​ మిషుస్తిన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది.

పాక్​ స్పీకర్​కు కరోనా..

పొరుగు దేశం పాకిస్థాన్​ జాతీయ అసెంబ్లీ స్పీకర్​ అసద్ ఖైసర్​కు కరోనా పాజిటివ్​ వచ్చింది. కరోనా సోకినట్లు​ తెలియగానే ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పాక్​ నేతల్లో ఖైసర్​ కన్నా ముందు సింధ్ రాష్ట్ర గవర్నర్ ఇమ్రాన్​ ఇస్మాయిల్​కు కరోనా సోకింది.

పాక్​లోనూ కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 990 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 మంది చనిపోయారు. పాకిస్థాన్​లో ఇప్పటివరకు మొత్తం 16,817 కేసులు పాజిటివ్​గా తేలగా.. 385 మంది మరణించారు.

పంజాబ్​, సింధ్​ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఆ దేశంలో సగానికి పైగా కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.

సింగపూర్​లోనూ..

సింగపూర్​లో కరోనా వైరస్​ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 528 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 16,169కు చేరింది. ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు.

కరోనా కేసుల్లో అధిక శాతం విదేశీయులేనని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వసతి గృహాల్లో నివసించే విదేశీ కార్మికుల వల్ల వ్యాప్తి అధికంగా ఉందని స్పష్టం చేశారు. ఇలాంటివి దేశంలో 12 క్లస్టర్లు ఉన్నట్లు గుర్తించారు.

పార్లమెంటులో చర్చ..

ఈ విషయంలో సింగపూర్​ పార్లమెంటు సోమవారం చర్చ చేపట్టనుంది. కరోనా పరీక్షల నుంచి విదేశీ కార్మికుల జీవన పరిస్థితుల వరకు అనేక అంశాలపై ఎంపీలు ప్రశ్నలు సంధించనున్నారు.

Last Updated : May 1, 2020, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.