ETV Bharat / international

ప్రపంచ వ్యాప్తంగా లక్షకు చేరువలో కరోనా కేసులు - biometric attendance

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో మాత్రం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. చైనాలో మొత్తం 3042 మంది చనిపోయారు. ఇరాన్​లో మృతుల సంఖ్య 124కి పెరిగింది. భూటాన్​, నెదర్లాండ్స్​, వాటికన్ సీటీ, కామెరూన్​, సెర్బియా దేశాల్లో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి.

corona cases reaching towards one lakh across the world
ప్రపంచ వ్యాప్తంగా లక్షకు చేరువవుతున్న కరోనా కేసులు
author img

By

Published : Mar 6, 2020, 8:02 PM IST

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా చైనా వెలుపల దాదాపు 17 రెట్ల వేగంతో విస్తరిస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. ప్రపంచదేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇరాన్​లో కరోనా మృతుల సంఖ్య 124కు పెరిగింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 148కి చేరింది. భూటాన్, నెదర్లాండ్స్‌, వాటికన్‌ సిటీ, సెర్బియా, కామెరూన్ సహా మరికొన్ని దేశాల్లో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావంతో ఆసియా- పసిఫిక్ దేశాలు ఈ ఏడాదిలో దాదాపు 211 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూడనున్నట్లు కొన్ని ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి.

దాదాపు 87 దేశాలను చుట్టేసిన కొవిడ్‌-19 దాదాపు 3 వేల 385 మందికిపైగా ప్రాణాలు బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య దాదాపు లక్ష(98,123)కి చేరువైంది. పరిస్థితి చాలా ఘోరంగా ఉందని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో).యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించింది. ఐరోపా, అమెరికాలో ఒక్క సారిగా మరణాలు, కరోనా కేసులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో కరోనాను ఎదుర్కోవడంలో సరైన సన్నద్ధత కనబరచక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడింది. ఈ కారణంగానే ఫ్రాన్స్‌, గ్రీస్‌, ఇటలీ, ఇరాన్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా మరణాల రేటును తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది.

పెరుగుతున్న మరణాలు..

కరోనా ప్రభావంతో చైనాలో మొత్తం 3 వేల 42 మంది చనిపోయారు. 80 వేల 552 మంది వైరస్ బారిన పడ్డారు. కొత్తగా 143 కేసులు నమోదైనట్లు బీజింగ్ తెలిపింది. చైనా వెలుపల 343 మృతి చెందారు. కేసుల సంఖ్య 17,571కి చేరింది. దక్షిణ కొరియాలో 42మంది చనిపోగా, 6వేల284 మందికి వైరస్ సోకింది. ఇటలీలో మృతుల సంఖ్య 148 కి పెరగ్గా మరో 3 వేల 858 మందికి సోకింది. ఇరాన్ లో చనిపోయిన వారి సంఖ్య 124కు చేరింది. ఆ దేశంలో ఇప్పటివరకు 3 వేల 513 మంది కరోనా బారిన పడ్డారు.

8.27లక్షల మంది నిర్భంధం

చైనీస్ లూనార్​ న్యూ ఇయర్​ హాలిడే అనంతరం బీజింగ్​కు తిరిగివచ్చిన 8.27 మందికి 14రోజులు గృహ నిర్బంధం విధించింది అక్కడి ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: కరోనా వ్యాప్తికి మన శరీరంలో ఉండే అదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.