ETV Bharat / international

ఆ రెస్టారెంట్​లో 'కరోనా బర్గర్'​కు భలే గిరాకీ

author img

By

Published : Mar 26, 2020, 10:56 AM IST

Updated : Mar 26, 2020, 12:11 PM IST

వియాత్నం హనోయ్​ నగరంలో కరోనా వైరస్​ ఆకృతిలో బర్గర్​లను తయారుచేసి విక్రయిస్తోంది ఓ రెస్టారెంట్​. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

coron burger sales in a restaurant  in vietnam country of Hanoi city
ఆ రెస్టారెంట్​లో 'కరోనా బర్గర్'​కు భలే గిరాకీ
ఆ రెస్టారెంట్​లో 'కరోనా బర్గర్'​కు భలే గిరాకీ

కరోనా వైరస్... ప్రస్తుతం​ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారిని తరిమేయడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా పేరు వినపడితేనే ప్రజలు ఆమడ దూరం పరిగెడుతుంటే... వియాత్నంలోని ఓ రెస్టారెంట్​ మాత్రం కరోనా వైరస్​ను వ్యాపారం పెంచుకునే అస్త్రంగా మార్చుకుంది. చూడటానికి అచ్చం వైరస్​ను పోలి ఉన్న బర్గర్​లను తయారు చేసింది.

హనోయ్​ నగరంలోని ఉన్న ఆ రెస్టారెంట్​ ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తోంది. పాలకూర ఫ్లేవర్​తో కరోనా ఆకృతిలో తయారుచేసిన బర్గర్​లను బుధవారం నుంచి విక్రయించడం ప్రారంభించింది. ఈ బర్గర్​ను రుచి చూసేందుకు స్థానికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తొలిరోజే 100 ఆర్డర్లు వచ్చాయి.

విసుగు చెందడమే కారణం

ప్రస్తతం ప్రపంచంలో ఏ నోట విన్నా, ఎటూ చూసినా అంతా కరోనానే. దీంతో విసుగు చెందిన ఆ రెస్టారెంట్​ యజమాని కుమారుడు(10ఏళ్లు)... వైరస్​పై వ్యంగ్యంగా ఏదైనా చేయాలని తన తండ్రిని కోరాడు. ఫలితంగా ఆ యజమాని కరోనా ఆకృతిలో బర్గర్​ను తయారు చేశాడు.

వైరస్​ ధాటికి దెబ్బతిన్న వ్యాపారం మళ్లీ కరోనా బర్గర్​ కారణంగానే పుంజుకుంటుందని ఆశిస్తున్నాడు యజమాని.

ఇదీ చూడండి : కరోనా కాలంలో బర్త్​ డే పార్టీ ఇలా చేసుకోవాలి...

Last Updated : Mar 26, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.