ETV Bharat / international

'ప్రజల విశ్వాసమే అస్త్రంగా కరోనాపై కివీస్ గెలుపు'

కరోనా నివారణకు ప్రపంచ దేశాలన్నీ అలుపులేని పోరాటం సాగిస్తున్నాయి. అగ్రరాజ్యాలు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం న్యూజిలాండ్ మాత్రం విజయవంతంగా కరోనాను దేశం నుంచి తరిమికొట్టింది. తొలినాళ్లలోనే అప్రమత్తంగా వ్యవహరించి ఇప్పుడు కరోనా రహిత దేశంగా అవతరించింది. ఇందుకోసం ఆ దేశం పాటించిన విధానాలేంటి? ఆచరణలో పెట్టిన ప్రణాళికలేంటి? అనే విషయాలతో పాటు మరిన్ని అంశాలను న్యూజిలాండ్​లోని భారత హైకమిషనర్ ఈటీవీ భారత్​కు ప్రత్యేకంగా వివరించారు.

'ప్రజల విశ్వాసంతో కరోనాను గెలిచిన న్యూజిలాండ్'
author img

By

Published : Jun 13, 2020, 2:54 PM IST

ప్రపంచంలోని అన్ని దేశాలపై కరోనావైరస్ మహమ్మారి కాలనాగై విషం చిమ్ముతోంది. అగ్రరాజ్యంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలన్నీ వైరస్ ధాటికి కుదేలవుతున్నాయి. కొవిడ్​ను కట్టడి చేయలేక చతికిలపడ్డాయి. కానీ, కేవలం 50 లక్షల జనాభా ఉన్న అతి చిన్న దేశం న్యూజిలాండ్ మాత్రం కరోనాను విజయవంతంగా అరికట్టింది. మహమ్మారిపై విజయం సాధించిన మరో 8 దేశాల సరసన చేరింది.

మే 29 నుంచి న్యూజిలాండ్​లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. జూన్​ 9 నాటికి బాధితులంతా కోలుకోవడం వల్ల ఆ దేశం 'కొవిడ్-ఫ్రీ కంట్రీ'గా అవతరించింది.

న్యూజిలాండ్ యువ ప్రధాని జెసిండా ఆర్డెర్న్​ అయితే ఏకంగా డ్యాన్స్ చేస్తూ ఈ విజయాన్ని ఆస్వాదించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. దేశీయ ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే కార్యక్రమాలకు సైతం అనుమతులిచ్చారు. సరిహద్దు ఆంక్షలను కొనసాగిస్తున్నారు. త్వరలో ఆస్ట్రేలియా సహా పసిఫిక్ దేశాలకు విమాన ప్రయాణాలను త్వరలోనే అనుతించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కట్టడికి కారణమిదే..

దేశదేశాలన్నీ వైరస్​ను నియంత్రించలేక వెనకబడిపోతుంటే న్యూజిలాండ్ మాత్రం ఎలా ఈ ఘనత సాధించగలిగిందన్నది చాలా మంది అనుమానం. ముందస్తు హెచ్చరికలు, స్పష్టమైన సందేశాలు జారీ చేయడం, ప్రధాని పట్ల ప్రజలకున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమని న్యూజిలాండ్​లోని భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశీ చెప్పుకొచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో ఆక్లాండ్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్​లో కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలు, పాటించిన విధానాలపై పలు విషయాలు వెల్లడించారు.

ఈటీవీ భారత్​ ప్రతినిధితో ముక్తేశ్ పర్దేశీ

న్యూజిలాండ్​లో ఇప్పటివరకు మొత్తం 1504 కరోనా కేసులు నమోదయ్యాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కరోనా నివారణలో దేశ పరిణామం, జన సాంద్రత న్యూజిలాండ్​కు కలిసొచ్చినట్లు పేర్కొన్నారు పర్దేశీ. 50 లక్షల వరకు జనాభా ఉన్నప్పటికీ.. దేశ భౌగోళిక పరిణామం విశాలంగా ఉంటుందని.. ప్రజలను దూరంగా ఉంచడం, స్వీయ నిర్బంధం పాటించేలా చేయడం తేలిక అని వెల్లడించారు. కేసులు తక్కువగా ఉండటం వల్ల కట్టడి చేయడం సులువైందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల నుంచి కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు.

ముందస్తు అప్రమత్తత

వైరస్​ వ్యాపించిన తొలినాళ్లలోనే న్యూజిలాండ్ అప్రమత్తమైనట్లు తెలిపారు పర్దేశీ. నాలుగు దశల వైద్య హెచ్చరిక వ్యవస్థను ఆచరణాత్మకంగా అభివృద్ధి చేయగలిగారని పేర్కొన్నారు. మార్చి 20న తొలి దశ హెచ్చరిక జారీ చేయగా.. మూడు నాలుగు రోజుల్లోనే నాలుగో దశకు చేరుకున్నట్లు స్పష్టం చేశారు. నాలుగోది అత్యున్నత దశ అని తెలిపారు.

"అప్పటికే దేశంలో నమోదైన కేసులు చాలా వరకు ఇరాన్, చైనా వంటి విదేశాల నుంచే వచ్చినవని గ్రహించి... సరిహద్దులు(వాయుమార్గం) మూసేశారు. వైద్య హెచ్చరికలను జారీ చేసే ముందే ప్రజలకు వాటి గురించి పూర్తి అవగాహన కల్పించేలా ప్రధాని జెసిండా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రజలు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు."

-ముక్తేశ్ పర్దేశీ, న్యూజిలాండ్​లోని భారత హైకమిషనర్

ప్రభుత్వంతో ప్రజలు పూర్తిగా సహకరించారని, ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజలు అపారమైన విశ్వాసం ఉంచారని తెలిపారు పర్దేశీ. ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలు, స్పష్టమైన సందేశం అందించడం వంటి అంశాలు న్యూజిలాండ్​ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంకా సాధారణం కాలేదు

ప్రస్తుతం దేశంలో ఒకటో వైద్య హెచ్చరిక దశ కొనసాగుతోందని, అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణంగా మారలేదని పేర్కొన్నారు పర్దేశీ. విదేశీయులను దేశంలోకి అనుమతించడం లేదని, ఇతర దేశాల్లో ఉన్న పౌరులను మాత్రమే న్యూజిలాండ్​కు అనుమతిస్తున్నట్లు చెప్పారు. వీరు తిరిగొచ్చిన తర్వాత 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేలా అక్కటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరో రెండు, మూడు వారాలు దేశంలో కరోనా కేసులు బయటపడకపోతేనే... విదేశీ ప్రయాణాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు పర్దేశీ తెలిపారు. అది కూడా న్యూజిలాండ్​కు దగ్గరగా ఉన్న ఆస్ట్రేలియా, ఇతర పసిఫిక్ దేశాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ప్రభుత్యం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత్​ నుంచి విమానాలు అనుమతిస్తారా?

ప్రస్తుతం న్యూజిలాండ్​లో ఉన్న భారత పౌరులను తిరిగి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకే విమాన సర్వీసులను అనుమతిస్తున్నట్లు పర్దేశీ తెలిపారు. దాదాపు 3 వేల మంది అక్కడ చిక్కుకున్నారని, వారి కోసం 9 ఎయిరిండియా విమానాలను భారత్​ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వందే భారత్ మిషన్ కింద జూన్ 30 నాటికి వీరందరినీ భారత్​కు చేరవేయనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పాటు భారత్​లో చిక్కుకున్న న్యూజిలాండ్​ పౌరులను ఆ దేశానికి పంపిస్తున్నట్లు చెప్పారు.

కొవిడ్​పై పోరులో భాగంగా ఇరుదేశాల మధ్య అవసరమైన సహకారం కొనసాగుతోందని తెలిపారు.

"కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్​ ఉప ప్రధానితో భారత విదేశాంగ శాఖ ఫోన్​లో సంభాషించింది. న్యూజిలాండ్ ఉప ప్రధాని ఫిబ్రవరి నెలలో భారత్​లో పర్యటించారు కూడా. కొన్ని ఔషధాల కోసం న్యూజిలాండ్ భారత్​పై ఆధారపడింది. వారి అభ్యర్థన మేరకు అంతరాయం కలగకుండా ఔషధాలు సరఫరా చేస్తున్నాం. స్నేహపూర్వక, నమ్మకమైన భాగస్వాములుగా ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నాం."

చైనాకు దూరంగా!

కొవిడ్ మూలాలపై దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేసినందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను వాణిజ్య ఆంక్షలతో చైనా బెదిరించిన విషయంపై స్పందించారు ముక్తేశ్.

"చైనాతో న్యూజిలాండ్​కు చాలా దృఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. న్యూజిలాండ్​కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రస్తుత పరిణామాల మధ్య ఒకే దేశంపై పూర్తిగా ఆధారపడితే భవిష్యత్తులో మనుగడ సాగించలేమని ఇక్కడి వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఇతర మార్కెట్లను అన్వేషించే అవకాశం ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి."

యథావిధిగా 'యోగా డే'

ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన క్రికెట్ వ్యవహారాలపై స్పందించారు ముక్తేశ్. జనవరిలోనే భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్​లో పర్యటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశీయ రగ్బీ సిరీస్​లను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. యోగా దినోత్సవాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

"దేశంలో ప్రజల ప్రయాణాలపై ఆంక్షలు లేవు. అందువల్ల గతేడాది జరుపుకున్నట్లే ఈసారి కూడా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తాం. ఈసారి యోగా దినోత్సవాన్ని సాధారణ పద్ధతిలో జరుపుకునే ఏకైక దేశం న్యూజిలాండే కావచ్చు."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.