ETV Bharat / international

'సైనికుడ్ని అప్పగించి భారత్ సుహృద్భావాన్ని చాటుకుంది' - china defense expert

భారత సైన్యం చైనా సైనికుడ్ని తిరిగి అప్పగించడంపై ఆ దేశ రక్షణ నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్​ సానుకూలంగా వ్యవహరించి సుహృద్భావాన్ని చాటుకుందని తెలిపారు.

Chinese defence expert states that India showed goodwill by returning captured PLA soldier
'ఆ విషయంలో భారత్​ సద్భావంతో ప్రవర్తించింది'
author img

By

Published : Jan 12, 2021, 5:13 AM IST

దేశంలోకి ప్రవేశించిన సైనికుడిని తిరిగి అప్పగించడం ద్వారా భారత్ తన సుహృద్భావాన్ని చాటుకుందని చైనా రక్షణ నిపుణుడు పేర్కొన్నారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సానుకూలంగా వ్యవహరించిందని త్సింఘువా యూనివర్సిటీకి చెందిన 'చైనా జాతీయ వ్యూహాత్మక సంస్థ'.. పరిశోధన శాఖ డైరెక్టర్ క్వియాన్ ఫెంగ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి నాలుగు రోజుల్లోనే జవానును భారత్ అప్పగించిందని గుర్తు చేశారు.

శుక్రవారం భారత సైన్యానికి చిక్కిన చైనా సైనికుడ్ని ఆదివారం ఆ దేశానికి అప్పగించారు అధికారులు. చుషుల్‌-మోల్డో వద్ద ఉదయం 10 గంటల 10 నిమిషాలకు చైనా సైనికుడిని అప్పగించినట్లు భారత సైన్యం తెలిపింది. సైనిక నిబంధనల మేరకు చైనా సైనికుడ్ని భారత సైన్యం విచారించింది. సరిహద్దు దాటి రావాల్సిన పరిస్థితులపై దర్యాప్తు జరిపింది.

ఇదీ చదవండి : 'అలా శ్వాస తీసుకుంటే.. వైరస్​ ముప్పు అధికం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.