ETV Bharat / international

చైనా కరోనా టీకా​ మూడోదశ ట్రయల్స్​ షురూ - Chinese Foreign Ministry spokesman Zhao Lijian

చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్​ మూడో దశ ప్రయోగాలకు చేరుకుంది. ఈ మేరకు సెంట్రల్​ చైనాలోని హూనాన్​ రాష్ట్రంలో టీకా ప్రయోగాలు చేపట్టనున్నట్టు ఆ దేశం తెలిపింది. సుమారు 29వేల మంది వలంటీర్లకు టీకా అందించనున్నారు.

Chinese COVID-19 vaccine enters third-stage human trial
చైనాలో కరోనా వ్యాక్సిన్​ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభం
author img

By

Published : Nov 21, 2020, 5:55 AM IST

చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్​పై మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభమయ్యాయి. సెంట్రల్​ చైనా- హునాన్​ రాష్ట్రంలోని జియాంగ్టన్​లో 18 ఏళ్లు పైబడిన వారిపై ఈ ట్రయల్స్​ చేపట్టనున్నారు.

ఇది 'రీకాంబినెంట్ సబ్​యూనిట్​ కొవిడ్-19 వ్యాక్సిన్' కోసం చేపట్టిన తొలి ప్రయోగమని అన్హుయి ఝిపీ లాంగ్​కమ్​ బయో ఫార్మాస్యూటికల్​ ఓ ప్రకటనలో తెలిపింది. చైనీస్​ సైన్స్​ అకాడమీ, మైక్రో బయాలజీ ఇన్​స్టిట్యూట్​లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాకు జూన్​ 19న ఆ దేశ వైద్య పరిశోధనా విభాగం నుంచి అనుమతి లభించింది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 29వేల మంది వలంటీర్లకు టీకా అందించేందుకు చైనా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖర్లో ఉజ్బెకిస్థాన్​లో గ్లోబల్​ ట్రయల్స్​ ప్రారంభించాలని భావిస్తోంది టీకా ఉత్పత్తి సంస్థ. ఆ తర్వాత ఇండోనేషియా, పాకిస్థాన్​, ఈక్వెడార్​లో ప్రయోగాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

చైనాలో మొత్తం 5 కరోనా వ్యాక్సిన్​లు అభివృద్ధి దశలో ఉండగా.. యూఏఈ, బ్రెజిల్, పాక్​, పెరూ దేశాల్లో క్లినికల్​ ట్రయల్స్​ కొనసాగుతున్నాయని అక్కడి విదేశాంగ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: డిసెంబర్​లోనే అందుబాటులోకి ఫైజర్​ వ్యాక్సిన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.