ETV Bharat / international

వ్యాక్సిన్​కు చేరువలో చైనా- రెండు క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి - చైనా కరోనా వ్యాక్సిన్​

చైనాకు చెందిన వ్యాక్సిన్​ తయారీ సంస్థ సినోవాక్ బయోటెక్​ .. కరోనా టీకా రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​ విజయవంతమైనట్లు ప్రకటించింది. వ్యాధి నిరోధక శక్తి సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. తర్వలో మూడో దశను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

China's Sinovac says its coronavirus vaccine showed positive results in trials
వ్యాక్సిన్​కు చేరువలో చైనా రెండు క్లీనికల్​ ట్రయల్స్​ పూర్తి
author img

By

Published : Jun 14, 2020, 8:57 PM IST

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్​ తయారీలో చైనా ముందడుగు వేసింది. బాధితులపై ప్రయోగించిన వైరస్​ టీకా.. మొదటి, రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​​ విజయవంతమైనట్లు సినోవాక్​ బయోటెక్​ సంస్థ ప్రకటించింది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడటాన్ని గుర్తించినట్లు తెలిపింది.

18 నుంచి 59 సంవత్సరాల వయసు గల మొత్తం 743 మందిపై క్లినికల్​ ట్రయల్ చేసినట్లు వెల్లడించింది. వీరిలో మొదటి దశలో 143 మందిపై, రెండో దశలో 600 మందిపై ప్రయోగం చేసినట్లు పేర్కొంది. రెండు సార్లు టీకాలను పొందిన 14 రోజుల వరకు 90 శాతం మందిలో యాంటిబాడీలు తటస్థంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. అలాగే ఎటువంటి సైడ్​ ఎఫెక్ట్స్ లేవని తెలిపింది.

రెండు దశలు విజయవంతమైన కారణంగా మూడో దశ ట్రయల్ నిర్వహించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది సంస్థ. మూడో ట్రయల్​ను చైనా వెలుపల ప్రయోగించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం బ్రెజిల్​లోని ఇన్‌స్టిట్యూట్​ బుటాంటన్‌ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.

మొదటి, రెండో దశలో వచ్చిన ఫలితాలు ఎంతో ఉత్తేజాన్ని నింపాయని, కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మరో మైలు రాయిని చేరినట్లు సినోవాక్​ సీఈఓ వీడాంగ్ హర్షం వ్యక్తం చేశారు​. కరోనాతో బాధపడుతున్న వారిని రక్షించేందుకు అవసరమైన వ్యాక్సిన్​ డోసులను తయారు చేస్తున్నట్లు తెలిపిన వీడాంగ్​... వైరస్​ నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

చైనా రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ భాగస్వామ్యంతో 2020 జనవరి 19 నుంచి కరోనా వ్యాక్సిన్ తయారీకి పూనుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్​ 13న ట్రయల్స్​ నిర్వహించేందుకు చైనా ఎన్​ఎమ్​పీఎ నుంచి అనుమతులు లభించినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:ఆపరేషన్​ దిల్లీ: కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.