ETV Bharat / international

చైనా చేతికి తొలి హెలికాప్టర్ డ్రోన్- భారత్​పై గురి! - చైనా చేతికి తొలి మానవరహిత చాపర్​

భారత్​తో సరిహద్దు వెంబడి ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో చైనాకు మరో అత్యాధునిక చాపర్​ అందుబాటులోకి వచ్చింది. తొలి మానవరహిత హెలికాప్టర్ డ్రోన్​​ను గత బుధవారం చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించగలిగే ఈ చాపర్​.. కాల్పులు జరపగలదు, శత్రువుపై నిఘా పెట్టగలదు.

China's high altitude unmanned helicopter drone for Tibet makes maiden test flight: Report
చైనాలో ఆకాశానికి ఎగిరిన తొలి మానవరహిత విమానం
author img

By

Published : May 25, 2020, 7:53 PM IST

ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించగలిగే తొలి మానవరహిత చైనా హెలికాప్టర్ డ్రోన్​​ ఆకాశంలోకి ఎగిరింది. కాల్పులు జరపడం, ఎత్తు నుంచి నిఘా పెట్టడం వంటివి దీని ప్రత్యేకతలు. చైనా ఈ చాపర్​ను భారత సరిహద్దు వెంబడి మోహరించే అవకాశముందని ఓ నివేదిక వెల్లడించింది.

మానవరహిత ఏఆర్​500సీ హెలికాప్టర్​.. టిబెట్​లో భారత్​తో ఉన్న చైనా సరిహద్దు భద్రతకు సహాయపడుతుందని ఆ దేశ గ్లోబల్​ టైమ్స్​ పేర్కొంది.

గత బుధవారం.. తూర్పు చైనాలోని జింగ్​షీ రాష్ట్రం నుంచి చేసిన ఈ డ్రోన్ ప్రయోగం విజయవంతమైంది. ఈ హెలికాప్టర్​ను ఏవియేషన్​ ఇండస్ట్రీ కార్పొరేషన్​ ఆఫ్​ చైనా(ఏవీఐసీ) రూపొందించింది.

5,000 మీటర్ల ఎత్తు నుంచి దీనిని టేక్​ ఆఫ్​ చేయవచ్చు. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఐదు గంటల పాటు నిర్విరామంగా ఎగురుతుందీ చాపర్​. 500కేజీల బరువును మోయగలదు.

నిఘా, సమాచార పంపిణీ దీని ముఖ్య లక్ష్యం. అయితే దీనికి అదనపు పరికరాలు జోడిస్తే.. కాల్పులు జరపడానికి, కార్గో సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.

భారత్​తో సరిహద్దు వెంబడి ఉద్రిక్తత వాతావరణ నెలకొన్న తరుణంలో చైనాకు ఈ చాపర్​ అందుబాటులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.