ETV Bharat / international

సైనిక రవాణాలో చైనా మరో ముందడుగు

సైనిక రవాణాను అత్యంత వేగిరం చేసే దిశగా చైనా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవలె ప్రారంభించిన హైస్పీడ్​ రైలులో తొలిసారిగా తమ సైనికులను భారత సరిహద్దు ప్రాంతాలకు తరలించింది. ఈ మేరకు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ బుధవారం వెల్లడించింది.

author img

By

Published : Aug 5, 2021, 7:03 AM IST

China's first high-speed train
చైనా సైనికులు రవాణా

లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఆ దేశం మరో కీలక చర్య చేపట్టింది. టిబెట్‌ రాజధాని లాసా, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులోని వ్యూహాత్మక పట్టణం నియింగ్చి మధ్య ఇటీవలే ప్రారంభించిన హైస్పీడ్‌ రైలులో తొలిసారిగా సైనిక బృందాన్ని తరలించింది. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అనుబంధ విభాగమైన కంబైన్డ్​ ఆర్మ్స్‌ బ్రిగేడ్‌లో కొత్తగా చేరిన సైనికులను ఈ రైలులో 4500 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ వ్యాయామ క్షేత్రానికి తీసుకెళ్లినట్లు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ బుధవారం వెల్లడించింది. సైనిక రవాణాను అత్యంత వేగిరం చేసే దిశగా చైనా చేపడుతున్న చర్యల్లో ఇది కీలక ముందడుగు అని పేర్కొంది.

దేశ సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతుల నిర్మాణంపై చైనా ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే వాయు, రైలు, రోడ్డు రవాణా మార్గాలను అభివృద్ధి చేసింది. గంటకు 160 కిమీ. వేగం సామర్థ్యమున్న హైస్పీడ్‌ రైలును జూన్‌ 25న ప్రారంభించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న చైనా.. అది తమ దేశంలో అంతర్భాగంగా ప్రకటించుకుంటోంది. ఆ వాదనను భారత్‌ తిరస్కరిస్తోంది.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​పై రాకెట్ దాడులు- వారి పనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.