ETV Bharat / international

విదేశీ మీడియా అణచివేతకు చైనా నిరంతర నిఘా!

విదేశీ పాత్రికేయుల కదలికలపై నిరంతర నిఘా పెడుతూ చైనా ప్రభుత్వం అణచివేస్తోందని జియాన్లీ అనే ఓ రాజకీయ ఖైదీ 'నేషనల్​ రివ్యూ'కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇందుకోసం దేశ నిఘా వ్యవస్థలను, జాతీయ భధ్రతా విధానాలను వినియోగిస్తోందని ఆరోపించారు. గతేడాది చైనాలో కరోనా వ్యాప్తి సమయంలోనూ వారిపై నిఘాను కొనసాగించిందని చెప్పారు.

china
'విదేశీ మీడియాపై చైనా అణచివేత ధోరణి'
author img

By

Published : Apr 19, 2021, 5:01 AM IST

విదేశీ పాత్రికేయులను అణచి వేసేందుకు జాతీయ భద్రతా విధానాలను, నిఘా వ్యవస్థలను చైనా ప్రభుత్వం వినియోగిస్తోంది. దీని ద్వారా వారిని వేధింపులకు గురి చేసేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు 'నేషనల్​ రివ్యూ'కు రాసిన వ్యాసంలో జియాన్లి అనే ఓ రాజకీయ ఖైదీ పేర్కొన్నారు. విదేశి పాత్రికేయులపై నిఘా ఉంచడంలో చైనాకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని విమర్శించారు. గతేడాది కూడా కరోనా వైరస్​ విషయంలో విదేశీ పాత్రికేయులకు చైనా ప్రభుత్వం ఎలాంటి మినహాయింపును ఇవ్వలేదని తెలిపారు.

"చైనాలో విధులు నిర్వర్తించే విదేశీ పాత్రికేయులపై నిఘా పెట్టడంలో చైనా ప్రభుత్వానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గతేడాది కరోనా వ్యాప్తి సమయంలోనూ వారిపై నిఘాను కొనసాగించింది. విదేశీ పాత్రికేయులకు వైరస్​ సమాచారం చిక్కుకుండా దేశ నిఘా వ్యవస్థను, జాతీయ భద్రతా విధానాలను చైనా ప్రభుత్వం వినియోగించింది."

-జియాన్లీ, రాజకీయ ఖైదీ.

ఫారిన్​ కరస్పాండెంట్​ క్లబ్ ఆఫ్​ చైనా(ఎఫ్​సీసీసీ)​ నిర్వహించిన సర్వేలో వరుసగా మూడో ఏడాది కూడా చైనాలో విదేశీ విలేకరుల పని వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం మెరుగవ్వలేదని తేలిందని జియాన్లీ తన వ్యాసంలో పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో విదేశీ పాత్రికేయులు.. చైనా వదలి వెళ్లకుండా వారి వీసాలను చైనా ప్రభుత్వం పునరుద్ధరించలేదని తెలిపారు. షింజియాంగ్​ రాష్ట్రంలో వుయ్​గర్​ ముస్లింల మారణకాండ సమయంలోనూ విదేశీ మీడియాను చైనా ప్రభుత్వం తీవ్రమైన స్థాయిలో కట్టడి చేసిందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'ఇండో పసిఫిక్'లో చైనాకు చెక్​ పెట్టేలా అమెరికా, జపాన్​ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.