వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా, చైనా అధినేతలు డొనాల్డ్ ట్రంప్, షి జిన్పింగ్ అంగీకరించారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తాసంస్థ 'జినువా' తెలిపింది. అంతేకాకుండా చైనా ఎగుమతులపై సుంకాలను నిలిపివేసేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారని పేర్కొంది. రెండు దేశాల మధ్య సమానత్వం, పరస్పర గౌరవం కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
-
Xi, Trump agree to restart China-U.S. trade consultations pic.twitter.com/nNzfI9klwB
— China Xinhua News (@XHNews) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Xi, Trump agree to restart China-U.S. trade consultations pic.twitter.com/nNzfI9klwB
— China Xinhua News (@XHNews) June 29, 2019Xi, Trump agree to restart China-U.S. trade consultations pic.twitter.com/nNzfI9klwB
— China Xinhua News (@XHNews) June 29, 2019
జపాన్లో జరిగిన జీ-20 సమావేశంలో భాగంగా జిన్పింగ్, ట్రంప్ భేటీ అయ్యారు.
ఎగుమతులపై పరస్పర సుంకాల పెంపుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరిన నేపథ్యంలో గత నెలలో ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి.
ఇదీ చూడండి: ఇప్పటికీ ఒప్పందానికి అమెరికా సిద్ధమే: ట్రంప్