వచ్చే జులై నాటికి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలోని టిబెట్ వరకు బుల్లెట్ రైళ్లు నడిపేందుకు.. చైనా కార్యాచరణ ముమ్మరం చేసింది. చైనాలోని లాసా ప్రాంత రాజధాని నగరాన్ని తూర్పు టిబెట్‌లోని నింగ్‌చిని కలుపుతూ.. 435 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణం సాగుతోంది.
2014 నుంచి ఈ పనులు మొదలుకాగా వచ్చే జూన్ చివరకు ఆ మార్గంలో బుల్లెట్ రైలు పరిగెత్తనున్నట్లు చైనా రైల్వే అధికారులు వెల్లడించారు. టిబెట్‌లో విద్యుదీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్ కూడా ఇదే కానుంది. 2020 చివరికే అక్కడ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో రైలు పరుగులు పెట్టేలా ట్రాక్‌ను రూపొందించారు.
ప్రస్తుతం చైనాలో 37 వేల 900 కిలోమీటర్లే మేర హైస్పీడ్ రైళ్లు నడుస్తుండగా.. దానిని 2025 నాటికి 50 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా అభివృద్ధి చేసిన ఫుక్సింగ్ రైళ్లు 160 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్ల వరకు గరిష్ఠ వేగంతో పరుగులు పెట్టగలవు.
ఇదీ చదవండి:పాక్ ఆపరేషన్లలో 8మంది ఉగ్రవాదులు హతం!