ETV Bharat / international

'ఆపరేషన్​ సిలిగుడి'తో భారత్​పై చైనా కొత్త కుట్రలు! - India china

భారత్‌ బలహీనతలను దెబ్బతీసే విధంగా చైనా కుట్రలు పన్నుతోంది. భారత్​కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగుడి నడవాపై(చికెన్స్‌ నెక్‌)(Siliguri corridor) డ్రాగన్‌ కన్నేసింది. ఇందుకోసం భూటాన్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం చైనా ఓ అవగాహనకు వచ్చింది. దీనిలో భాగంగా రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసింది. దీంతో భారత్‌ వర్గాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది.

Siliguri corridor
సిలిగురి కారిడార్‌
author img

By

Published : Nov 7, 2021, 2:42 PM IST

వాస్తవాధీన రేఖ ఆవల చైనా చర్యలు భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల భారత్‌కు మిత్రదేశమైన భూటాన్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం చైనా ఓ అవగాహనకు వచ్చింది. ఈ క్రమంలో భారత్‌లోని సిలిగుడి కారిడార్​ను(చికెన్స్‌ నెక్‌)(Siliguri corridor) లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసింది. దీంతో భారత్‌ వర్గాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. ఇటీవల ఈస్టర్న్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే కూడా చికెన్స్‌ నెక్‌ ఎంతో 'సున్నితమైంది' అని అంగీకరించారు.

వ్యూహాత్మకంగా ఎందుకు ముఖ్యం..

ఈశాన్య భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచి వెళతాయి. దీంతోపాటు కీలక పైప్‌లైన్లు, కమ్యూనికేషన్‌ కేబుల్స్‌కు ఇదే మార్గం. పశ్చిమ బంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్‌ , భూటాన్‌, బంగ్లాదేశ్‌కు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డొక్లాం ట్రై జంక్షన్‌ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్‌ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి.

భూటాన్‌తో ఎంవోయూపై ఆందోళనలు..

పొరుగు దేశమైన భూటాన్‌ భద్రతకు భారత్‌ హామీ ఇస్తోంది. డోక్లాం ఘటన తర్వాత చైనా నిర్మాణాల వేగాన్ని పెంచింది. భూటాన్‌ భూభాగంలోని టోర్సా నది సమీపంలో చైనా రోడ్లను నిర్మిస్తున్నట్లు గతేడాది ఉపగ్రహ చిత్రాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భూటాన్‌-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని మూడు అంచెల్లో పరిష్కరించుకోవడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పంద వివరాలు బహిర్గతం కాలేదు. ఈ ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా చైనాకు చెందిన సీజీటీఎస్‌ పేర్కొంది. చైనా మీడియాలోని ఇతర వార్తాసంస్థల్లో కూడా ఇదే విధంగా కథనాలు వెలువడటం గమనార్హం.

చుంబీ లోయవైపు ఉన్న భూటాన్‌ భూమి చైనా చేతిలోకి వెళితే.. డోక్లాం ట్రై జంక్షన్‌ వద్ద పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పట్టు పెరిగిపోతుంది. దీంతో చైనా చుంబీ లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్షిపణులు, యుద్ధవిమానాలను సిలిగుడి లక్ష్యంగా మోహరించే ప్రమాదం ఉంది.

తీవ్రవాదం ముప్పు..

ఇప్పటికే చైనా అండదండలతో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం నెలకొంది. ఈ క్రమంలో సిలిగుడి ప్రాంతంలో తీవ్రవాదం, వేర్పాటు వాద భావజాలం పెరిగితే భారత్‌కు ఇబ్బందులు తప్పవని లెఫ్టినెంట్‌ జనరల్‌ పాండే గత నెలలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సైన్యం నేతృత్వంలో 'జాయింట్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌'ను ఏర్పాటు చేశారు. ఇది అక్కడ సీఏపీఎఫ్‌ వంటి మిగిలిన భద్రతా దళాలు, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొంటూ పనిచేస్తుందని లెఫ్టినెంట్‌ జనరల్‌ పాండే పేర్కొన్నారు.

పీఎల్‌ఏలో ఊపందుకున్న స్థానికుల నియామకాలు..

ఇటీవల ఆగస్టులో చుంబీలోయలోని ఫరిడోజాంగ్‌, యాతంగ్‌ వద్ద చైనాకు చెందిన పీపుల్స్‌లిబరేషన్‌ ఆర్మీ దాదాపు నెలరోజుల పాటు నియామకాలు చేపట్టింది. 400 మంది టిబెట్‌ వాసులను సైనిక శిక్షణకు ఎంపిక చేసినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ప్రతి ఇంటి నుంచి 18-40 ఏళ్ల మధ్య వయస్సు వారిని పీఎల్‌ఏ దళాల్లోకి తీసుకోవాలని చైనా భావిస్తోంది. ఎంపికైన వారికి లాసాలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రాంతాల్లో భౌగోళిక సవాళ్లను ఎదుర్కోవడానికే ఇలా చేస్తోంది. వీరిని భారత్‌, చైనా సరిహద్దుల్లో నియమించనుంది. ఈ ఏడాది జులైలో కూడా లద్దాఖ్‌ సమీపంలోని నంగారిలోని షిక్వాన్హేలో నియామకాలు చేపట్టింది. భారత్‌కు చెందిన స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(టిబెట్‌ వాసులతో ఏర్పాటు చేసిన దళం) గతేడాది కైలాష్‌ రేంజిని ఆక్రమించిన తర్వాత చైనా కూడా ఇలాంటి ఒక దళాన్ని ఏర్పాటు చేయాలని తహతహలాడుతోంది.

వివాదాస్పద స్థలంలో గ్రామం..

అరుణాచల్‌ ప్రదేశ్ వద్ద వివాదాస్పద భూభాగంలో చైనా 100 ఇళ్లతో గ్రామం నిర్మించిందని అమెరికా రక్షణ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ప్రదేశాన్ని చైనా 1959లో ఆక్రమించింది. సైనిక, పౌర అవసరాలకు వీలుగా ఇక్కడ గ్రామాన్ని నిర్మించింది. భారత సైన్యం కూడా ఈ విషయాన్ని పసిగట్టింది. తమ వ్యూహరచన సమయంలో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటామని లెఫ్టినెంట్‌ జనరల్‌ పాండే గత నెలలో పేర్కొన్నారు. భారత్‌ కూడా సరిహద్దు ప్రాంతాల్లో పౌర నివాసాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు మయన్మార్‌ వైపు నుంచి సరుకుల సరఫరా నిమిత్తం కళాదాన్‌ మల్టీమోడల్‌ ట్రాన్సిట్‌ పోర్టు ప్రాజెక్టు కూడా చేపట్టింది.

ఇదీ చూడండి: భూతాపానికి కరుగుతున్న 'ఆర్కిటిక్​'- జలప్రళయం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.