ETV Bharat / international

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో చైనా డేటా కేంద్రం! - చైనా వార్తలు

క్లౌడ్​ కంప్యూటింగ్​ డేటా కేంద్రాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మిస్తోంది చైనా. ఈ డేటా సెంటర్​కు స్వదేశంతో పాటు ఉత్తర ఆసియాలోని నేపాల్​, బంగ్లాదేశ్​, పాకిస్థాన్ సమాచారం కూడా నిల్వచేసే సామర్థ్యముంటుందని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఇందుకోసం 11.8 బిలియన్​ యువాన్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.

data-centre-in-tibet
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో డేటా కేంద్రం
author img

By

Published : Oct 29, 2020, 6:12 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ డేటా కేంద్రాన్ని టిబెట్‌లో నిర్మిస్తోంది చైనా. ఇందులో చైనా డేటాతోపాటు ఉత్తర ఆసియా దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సమాచారం కూడా నిల్వచేసే సామర్థ్యమున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

ఈ డేటా కేంద్రం.. టిబెట్‌ ప్రాంతీయ రాజధాని లాసాలో 3,656 మీటర్ల ఎత్తుల్లో నిర్మితమవుతోందని అ దేశ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఇందుకోసం 11.8 బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తున్నట్లు నింగ్సువాన్ టెక్నాలజీ గ్రూప్ తెలిపింది. వీడియో రెండరింగ్‌, అటానమస్‌ డ్రైవింగ్‌, దూరవిద్య డేటా నిల్వ లాంటి వివిధ రకాల సేవలను ఆయా ప్రాంతాల్లో ఈ డేటా కేంద్రం అందిస్తుందని పేర్కొంది.

2021 కల్లా ఈ ప్రాజెక్టులోని మొదటి దశ వినియోగంలోకి వస్తుందని, 10 వేల యంత్రాల్లో డేటా నిల్వచేసుకోవచ్చని ఆ దేశ మీడియా తెలిపింది. దీని ద్వారా 223.5 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని నింగ్సువాన్ టెక్నాలజీ గ్రూప్‌ ఉపాధ్యక్షుడు అంచనా వేశారు.

ఇదీ చూడండి: భాగస్వామ్యాలతో భారత్​ దూకుడు- చక్రబంధంలో చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.