ETV Bharat / international

పండుగల వేళ చైనాలో భారీగా కరోనా కేసులు - కరోనా కేసులు చైనా

చైనాలో ఎన్నో నెలల అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య 100 దాటింది. వైరస్​ మూలాలను కనుగొనేందుకు గురువారం డబ్ల్యూహెచ్​ఓ బృందం వస్తున్న తరుణంలో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో దేశంలో పండుగ సీజన్​ ప్రారంభంకానున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సొంతూళ్లకు వెళ్లవద్దని అభ్యర్థించారు.

China sees spike in coronavirus cases ahead of WHO team visit to probe COVID-19 origins
డబ్ల్యూహెచ్​ఓ బృందం పర్యటన వేళ చైనాలో కేసుల కలకలం
author img

By

Published : Jan 13, 2021, 7:23 PM IST

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అనేక నెలల తర్వాత.. రోజువారీ వైరస్​ కేసుల సంఖ్య 100 దాటింది. వైరస్​ మూలాలను కనుగొనేందుకు వూహాన్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం గురువారం వస్తున్న తరుణంలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

చైనాలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం 115కు పెరిగింది. ఇందులో 107 స్థానిక కేసులున్నట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ వెల్లడించింది. ఈ 107లో 90 కేసులు ఉత్తర చైనాలోని హిబే రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

చైనాలో మొత్తం కేసులు 87,706కు పెరగ్గా.. మొత్తం మృతుల సంఖ్య 4,634గా ఉంది.

పండుగ సీజన్​...

చైనాలో త్వరలోనే పండుగ సీజన్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్నందున సొంతూళ్లకు వెళ్లకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నారు.

ఈ సందర్భంలో గ్రామాలకు కూడా మార్గదర్శకాలు జారీ చేసింది చైనా ప్రభుత్వం. క్లినిక్​లు, ఆసుపత్రులు కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వం యంత్రాంగం అన్నింటికీ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది.

నిబంధనలు కఠినతరం..

పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం. అగ్రరాజ్యానికి ప్రయాణిస్తున్న వారు కొవిడ్​ నెగెటివ్​ రిపోర్టు తమ వెంట తీసుకెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. రెండు వారాల్లో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.

అమెరికాలో ప్రస్తుతం 2,33,73,736 కేసులున్నాయి. 3,89,786మంది ప్రాణాలు కోల్పోయారు.

వైరస్​ ఎమర్జెన్సీ..

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అమలు చేసిన ఎమర్జెన్సీని మరో 7 ప్రాంతాలకు విస్తరించింది జపాన్​. దీంతో దేశంలోని సగానికిపైగా జనాభా మీద ఈ ఎమర్జెన్సీ ప్రభావం పడినట్టు అయ్యింది. రాజధాని టోక్యోతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న మరో మూడు ప్రాంతాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ అమల్లో ఉంది. తాజాగా పశ్చిమ, మధ్య జపాన్​లోని 7 ప్రాంతాలు కూడా ఈ జాబితాలో చేరాయి.

దేశంలో ఇప్పటివరకు 2,92,212 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద 4,094మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆసుపత్రిలో అధ్యక్షుడు..

ఇటీవలే కరోనా పాజిటివ్​గా తేలిన అర్మేనియా అధ్యక్షుడు అర్మెన్​ సర్​కిస్సైన్​.. నిమోనియా కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని అధికారులు వెల్లడించారు.

జోర్డాన్​లో వ్యాక్సినేషన్​..

జోర్డాన్​లో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరోగ్య కార్యకర్తలు, కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికి తొలుత టీకాలు అందిస్తున్నారు. ఫైజర్​తో పాటు చైనా సినోఫామ్​ రూపొందించిన టీకాను ప్రజలకు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం.

ఇదీ చూడండి:- కరోనా​.. ఇక సాధారణ జలుబు కారకమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.