ETV Bharat / international

'కరోనా మూలాల'పై దర్యాప్తునకు చైనా ససేమిరా! - కరోనా మూలాలపై చైనా

వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌పై దర్యాప్తును వీలైనంత మేరకు అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే అంశంపై మరోసారి దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించడంపై చైనా మండిపడింది. డబ్ల్యూహెచ్​ఓ ప్రణాళికలు సైన్స్‌కు విరుద్ధంగా వెళ్తున్నట్లు అభిప్రాయపడింది.

WHO plan for COVID origins study
కరోనా మూలాలపై దర్యాప్తునకు చైనా నిరాకరణ
author img

By

Published : Jul 22, 2021, 6:07 PM IST

కరోనా వైరస్ మూలాలపై మరోసారి అధ్యయనం చేయాలనుకుంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రణాళికలను చైనా తోసిపుచ్చింది. డబ్ల్యూహెచ్​ఓ ఆలోచనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని చైనా ఆరోగ్య శాఖ అధికారి జెంగ్‌ యాక్సిన్ వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్​ఓ ప్రణాళికలు..సైన్స్‌కు విరుద్ధంగా సాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. తమ దేశంలో వైరస్‌ పుట్టుకపై డబ్ల్యూహెచ్​ఓ చేయాలనుకుంటున్న పరిశోధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరిశోధనల సమయంలో వుహాన్ ల్యాబ్‌ నుంచి వైరస్ లీకైందన్న వార్తలు ఊహజనితమైనవిగా కొట్టిపారేశారు.

వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైందన్న వార్తలను తాము తోసిపుచ్చడం లేదని ఇటీవల డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించింది. వుహాన్‌లో వైరస్‌ మూలాలపై పరిశోధించేందుకు అక్కడి మార్కెట్లు, ప్రయోగశాలలను దాచకుండా చైనా అధికారులు పారదర్శకత పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే వైరస్ పుట్టుకపై చైనాలో అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్తల బృందం మరోసారి చైనా వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వైరస్‌ మూలం తెలుసుకునేందుకు చైనాలోని మార్కెట్లలో వన్యజీవులపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తొలినాటి వైరస్ వ్యాప్తిపై సమాచారాన్ని ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో చైనా దాచడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ పుట్టుకపై పరిశోధనలో చైనా నిపుణులు అందించిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్​ఓ మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా జెంగ్ సూచించారు. ఇతర రాజకీయాలకు ప్రమేయం లేకుండా శాస్త్రబద్దంగా వైరస్‌ మూలాలను శోధించాలని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్​ఓ అధ్యయనాన్ని రాజకీయం చేయడం తాము ఎంత మాత్రం అంగీకరించమని స్పష్టం చేశారు.

ఈ ఏడాది మేలో చైనాలో వైరస్‌ పుట్టుకపై ఆధారాలు సేకరించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిఘా సంస్థలను ఆదేశించారు. ఈనేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ మరోసారి చైనాలో వైరస్‌ మూలాలపై పరిశోధనలకు ఉపక్రమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'కరోనా మూలాల నిర్ధరణకు చైనా సహకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.