ETV Bharat / international

'బలగాల ఉపసంహరణ సజావుగా సాగుతుంది' - భారత్​ బలగాలు వెనక్కి

తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని చైనా పేర్కొంది. ఈ విషయంపై ఇరు దేశాలు సామరస్యంగా ఉండాలని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్ పేర్కొన్నారు.

disengagement of Chinese and Indian troops
బలగాల ఉపసంహరణ సజావుగా సాగుతుంది: చైనా
author img

By

Published : Feb 18, 2021, 5:06 PM IST

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా... లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని చైనా పేర్కొంది. ఈ విషయంపై ఇరు దేశాలు సామరస్యంగా మెలగాలని అన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్.

పలుమార్లు సైన్యాధికారులు చర్చలు జరిపిన అనంతంరం బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని హువా గుర్తుచేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఎంత సమయం పడుతుందనే దానిపై స్పష్టత లేదని తెలిపారు.

ఫిబ్రవరి 10న ఇరు దేశాల బలగాలు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు సమీపం నుంచి వెనుదిరిగాయని చైనా రక్షణ ప్రతినిధి సీనియర్ కర్నల్ వూ క్సియాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత పాంగాంగ్​ సరస్సు ప్రాంతం నుంచి చైనా సైనికులు వెనుదిరిగిన వీడియో, ఛాయా చిత్రాలను భారత సైన్యాధికారులు విడుదల చేశారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:యూఎన్​డీపీలో భారత మహిళకు కీలక పదవులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.