జిన్జియాంగ్ ప్రాంతంలోని ఉయ్గర్లపై అణిచివేత ధోరణి అవలంబిస్తూ.. అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది చైనా. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 380 అనుమానాస్పద నిర్బంధ కేంద్రాలను గుర్తించినట్లు ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్(ఏఎస్పీఐ).. 'ద జిన్జియాంగ్ డేటా ప్రాజెక్ట్' పేరుతో నివేదిక రూపొందించింది. 2017 నుంచి కొత్త వాటిని నిర్మించటం, ఉన్నవాటిని విస్తరించటం వంటి విస్తృత చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
-
PROJECT LAUNCH📢
— ASPI (@ASPI_org) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Today ASPI launches 'The Xinjiang Data Project' mapping Xinjiang’s detention system with 380 sites of suspected re-education camps, detention centres and prisons that have been built or expanded since 2017. View the interactive map ➡️ https://t.co/iykruAT4PP pic.twitter.com/xpNphYlhwI
">PROJECT LAUNCH📢
— ASPI (@ASPI_org) September 24, 2020
Today ASPI launches 'The Xinjiang Data Project' mapping Xinjiang’s detention system with 380 sites of suspected re-education camps, detention centres and prisons that have been built or expanded since 2017. View the interactive map ➡️ https://t.co/iykruAT4PP pic.twitter.com/xpNphYlhwIPROJECT LAUNCH📢
— ASPI (@ASPI_org) September 24, 2020
Today ASPI launches 'The Xinjiang Data Project' mapping Xinjiang’s detention system with 380 sites of suspected re-education camps, detention centres and prisons that have been built or expanded since 2017. View the interactive map ➡️ https://t.co/iykruAT4PP pic.twitter.com/xpNphYlhwI
ఇటీవలే జిన్జియాంగ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మైనారిటీలను నిర్బంధించటంపై.. చైనాను ప్రపంచ దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఉయ్గర్లపై మతపరమైన, సాంస్కృతిక దాడులు సహా వారి నమ్మకాలను నిషేధించటం, వారిపై నిఘా, మహిళలకు బలవంతపు గర్భవిచ్ఛిత్తి వంటి చర్యలను ఎప్పటికప్పుడు పలు దేశాలు ఎత్తిచూపుతున్నాయి.
ఉయ్గర్ ముస్లింల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను సమర్థించుకున్న చైనా.. వాటి ద్వారా 2014 నుంచి సగటున 1.3 మిలియన్ల మంది తిరిగి విద్యాభ్యాసం చేసినట్లు తెలిపింది. షి జిన్పింగ్ ప్రభుత్వం.. కొద్ది రోజుల క్రితం జిన్జియాంగ్లో ఉపాధి, కార్మిక హక్కుల పేరుతో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శిబిరాలను వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా పేర్కొన్న చైనా.. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ప్రయత్నాలు అవసరమని పేర్కొంది.
ఇదీ చూడండి: కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్కు తలవంపులు!