ETV Bharat / international

కరోనా కాటు: చైనాలో మరో 71 మంది బలి

కరోనా కాటుకు చైనాలో తాజాగా 71 మంది మరణించారు. వైరస్​ కారణంగా ఇప్పటి వరకు 2,663 మంది మృతి చెందారు. జపాన్​ క్రూయిజ్​ షిప్​లో మరో వ్యక్తి వైరస్​కు బలయ్యారు.

China reports 71 more virus deaths
కరోనా కాటు: చైనాలో 71మంది.. నౌకలో ఒకరు
author img

By

Published : Feb 25, 2020, 9:32 AM IST

Updated : Mar 2, 2020, 12:11 PM IST

కరోనా వైరస్​ కారణంగా చైనాలో మరో 71మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాలతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్లు అధికారులు తెలిపారు. వైరస్​తో ఇప్పటివరకు 2,663 మంది మృతి చెందారు. తాజాగా మరో 409 కేసులు నమోదయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

తొలిసారి పార్లమెంటు సమావేశాలు వాయిదా..

వైరస్​ ప్రభావం వల్ల చైనాలో తొలిసారి వార్షిక పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. హుబే రాష్ట్రంలోని సుమారు 10మిలియన్ల మందికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

షిప్​లో మరో వ్యక్తి మృతి

జపాన్​ తీరంలో ఉన్న డైమండ్​ ప్రిన్సెస్​ నౌకలో మరో వ్యక్తి మృతి చెందారు. దీనితో షిప్​లో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

Last Updated : Mar 2, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.