ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. చైనాలో కొత్తగా 46మందికి వైరస్ సోకింది. గత నెలరోజుల్లో అక్కడ ఇవే అత్యధికం. సింగపూర్​లోనూ మరో 481మంది వైరస్ బారినపడ్డారు. పాకిస్థాన్​లో కరోనా మృతుల సంఖ్య 5వేల 882కు చేరింది.

China reports 46 new cases on opposite ends
చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jul 26, 2020, 7:05 PM IST

కరోనా వైరస్​కు కేంద్రబిందువైన చైనాలో కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 46మంది వైరస్ బారినపడినట్లు అధికారులు తెలిపారు. చైనాలో ఇప్పటివరకు 83వేల 830మందికి వైరస్ సోకింది. మొత్తం 4వేల 634మంది ప్రాణాలు కోల్పోయారు.

సింగపూర్​లో 481..

సింగపూర్​లో కొత్తగా 481 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 50వేల 369కి చేరింది.

సింగపూర్​లో​ ఈ వారం నుంచే కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్ ప్రారంభమవుతాయని స్థానిక మీడియా తెలిపింది. 108 మంది ఆరోగ్య కార్యకర్తలపై వ్యాక్సిన్​ను ప్రయోగించనున్నారు.

పాకిస్థాన్​లో...

పాకిస్థాన్​లో కొత్తగా నమోదైన 1226 పాజిటివ్​ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 73వేల 112కు చేరింది. 24 గంటల్లో 35మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5వేల 882కు పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 62లక్షల 37వేల 961మందికి కరోనా సోకింది. 6 లక్షల 49వేల 186మంది వైరస్​కు బలయ్యారు. 99లక్షల 37వేల 813మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాలు..

దేశంకేసులుమరణాలు
1అమెరికా43,16,0541,49,400
2బ్రెజిల్23,96,43486,496
3భారత్​13,85,52232,292
4రష్యా8,12,48513,269
5దక్షిణాఫ్రికా4,34,2006,655
6మెక్సికో3,85,03643,374
7పెరు3,79,88418,030
8చిలీ3,43,5929,020
9స్పెయిన్​ 3,19,50128,432
10బ్రిటన్​2,98,68145,738

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.