ETV Bharat / international

పంది మాంసం ధరపై రాజకీయం- సర్కార్​ అప్రమత్తం - చైనా సర్కార్​ అప్రమత్తం

పెరిగిపోతున్న పంది మాంసం ధరలు చైనా పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. త్వరలోనే చైనా కమ్యూనిస్ట్​ పార్టీ 70వ వార్షికోత్సవం జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆహార ధరల పెరుగుదల డ్రాగన్​కు మింగుడుపడడం లేదు. అందుకే తన దగ్గర ఉన్న నిల్వలతో పాటు, అమెరికా నుంచి దిగుమతి చేసుకుని మరీ మార్కెట్​లోకి విడుదల చేస్తోంది.

పంది మాంసం ధరపై రాజకీయం- సర్కార్​ అప్రమత్తం
author img

By

Published : Sep 26, 2019, 8:31 PM IST

Updated : Oct 2, 2019, 3:32 AM IST

చైనా కమ్యూనిస్ట్​ పార్టీ 70వ వార్షికోత్సవం జరగనున్న తరుణంలో.. పెరిగిపోతున్న పంది మాంసం ధరలు పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పండుగ సీజన్​లో ఈ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం... మరింతగా పందిమాంసాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం నిల్వ ఉంచిన 10 వేల టన్నుల పందిమాంసాన్ని వేలం వేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇలా చేయడం సెప్టెంబర్​ 18 నుంచి ఇది రెండోసారి.

స్వైన్​ దెబ్బకు ధర రెట్టింపు

చైనాలో పందిమాంసం రోజువారీ ఆహారంలో భాగం. ప్రపంచంలో మూడింట రెండు వంతుల పోర్క్​ను చైనా ఉత్పత్తి చేస్తుంది. అంతే పరిమాణంలో వినియోగిస్తుంది కూడా.

అయితే ఏడాది క్రితం చైనాలో ఆఫ్రికన్ స్వైన్​ ఫీవర్ వ్యాప్తి చెందింది. ఇది​ ప్రాణాంతకమైనది. పందులకు మాత్రమే సోకుతుంది. దీని వల్ల మానవులకు ఎలాంటి హాని లేకపోయినప్పటికీ.. విధిలేని పరిస్థితుల్లో అధికారులు అధిక సంఖ్యలో పందులను నిర్మూలించారు. ఫలితంగా పందిమాంసం ధరలు రెట్టింపు అయ్యాయి.​

దేశంలో పందిమాంసం ధర ఏడాది క్రితం నుంచి ఇప్పటి వరకు 82.7 శాతం, బతికి ఉన్న పందుల​ ధర 89.5 శాతం పెరిగిందని చైనా వ్యవసాయమంత్రిత్వశాఖ పేర్కొంది. సమస్య నివారణ కోసం ఇకపై పందుల పెంపకం చేపట్టే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

అమెరికా సాయం

ప్రస్తుతం చైనాలో 3 నుంచి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల పందిమాంసం నిల్వలు ఉన్నట్లు అంచనా. అయితే ఇది ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు డ్రాగన్ అమెరికా నుంచి పంది మాంసం, సోయాబీన్​లను దిగుమతి చేసుకుంది.

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి పరిణామం జరగడం విశేషం.

ఇదీ చూడండి: భారత్​లో శాంసంగ్ మడత ఫోన్ ధరెంతో తెలుసా!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 3:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.