చైనా విస్తరణ కాంక్షకు అడ్డూఆపూ ఉండటం లేదు. భూటాన్లోకి 2 కిలోమీటర్ల మేర డ్రాగన్ చొచ్చుకెళ్లినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. అక్కడ ఓ గ్రామాన్ని కూడా నిర్మించినట్టు వెల్లడైంది.
2017లో భారత్, చైనా సైన్యాల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడిన ప్రాంతానికి ఇది 9 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. ఈ గ్రామాన్ని పంగ్డా అని పిలుస్తున్నారు. చైనా అధికార మీడియాకు చెందిన ఓ సీనియర్ పాత్రికేయుడు పెట్టిన చిత్రాలు, ట్వీట్లతో ఈ విషయం బహిర్గతమైంది. అనంతరం వాటిని తొలగించారు.
ఆందోళనలో భారత్..
చిన్న చిన్న భాగాలుగా భారత్, భూటాన్ భాగాలను ఆక్రమించేందుకు చైనా వ్యూహరచన చేస్తోందన్న అనుమానాలను ఇది ధ్రువపరుస్తోంది. తాజా పరిణామం భారత్కు మరింత ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే.. భూటాన్ రక్షణ బాధ్యతలను మనదేశమే నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: భూటాన్లో 'రూపే' సేవలను ప్రారంభించనున్న మోదీ