ETV Bharat / international

టిబెట్‌ స్వేచ్ఛావాణికి భారత్‌ అండ అత్యవసరం! - india verses china

1950లో టిబెట్‌ను ఆక్రమించినా సామ్యవాద మత్తులో చైనాను ఖండించలేదు భారత్‌. కానీ, డ్రాగన్ దేశాన్ని గుడ్డిగా నమ్మినందుకు ఏళ్లుగా మూల్యం చెల్లించుకుంటోంది. కానీ, ఇప్పుడు టిబెట్‌ స్వేచ్ఛావాణికి భారత్‌ అండ అవసరం. చైనాను నిలువరించే వ్యూహం అత్యవసరం.

china occupied tibet needs india's help
టిబెట్‌ స్వేచ్ఛావాణికి భారత్‌ అండ!
author img

By

Published : Sep 12, 2020, 9:22 AM IST

చైనాను గుడ్డిగా నమ్మినందుకు భారత్‌ మొదటి నుంచీ భారీ మూల్యం చెల్లించుకొంటోంది. 1962 యుద్ధంలో ఓడిపోయింది మొదలు భారతదేశ హిమాలయ కంఠంలో చైనా బెడద ఒక క్యాన్సర్‌లా సలిపేస్తోంది. సరిహద్దులో చైనా వల్ల ఎప్పుడూ చికాకులే ఎదురవుతున్నాయి. ఇటీవలి గల్వాన్‌ ఘర్షణలు పుండు మీద కారం రాసినట్లున్నాయి. పరిస్థితి ఇంతవరకు రావడానికి 1950లో టిబెట్‌ను ఆక్రమించినా సామ్యవాద మత్తులో చైనాను ఖండించకుండా భారత్‌ ఊరుకోవడమే కారణం.

మావో జెడాంగ్‌ నాయకత్వంలో రక్తపాత విప్లవంతో ఆవిర్భవించిన కమ్యూనిస్టు చైనాతో భారత్‌ చెలిమి చేసింది. టిబెట్‌తో వందల సంవత్సరాలుగా పటిష్ఠ సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ, వాటిని విస్మరించి హిందీ-చీనీ భాయిభాయి అని పరవశించిపోయింది. దీనివల్ల హిమాలయాల్లో 4,085 కిలోమీటర్ల పొడవునా చైనా సైన్యం తిష్ఠవేసి, భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైంది. అంతకుముందు టిబెట్‌ సరిహద్దులో కేవలం 60 మంది భారతీయ పోలీసులు పహరా ఉండేవారు. టిబెట్‌ను చైనా కబ్జా చేయడానికి ముందు భారత్‌-చైనాల మధ్య ఉమ్మడి సరిహద్దు అనేదే లేదు. టిబెట్‌ స్వతంత్ర దేశమైతే అది ప్రపంచంలో పదో పెద్ద దేశంగా నిలిచేది. సముద్ర మట్టానికి 4,000 మీటర్ల ఎత్తులో, 25 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన టిబెట్‌ను ప్రపంచ పైకప్పుగా వర్ణిస్తారు.

డ్రాగన్‌ దురాక్రమణతో కకావికలం

ప్రపంచంలోని మొత్తం హిమనదాల్లో నాలుగో వంతు (46 వేలవరకు) ఒక్క టిబెట్‌లోనే ఉన్నాయి. వాటి నుంచి సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్‌, సాల్వీన్‌, మెకాంగ్‌, యాంగ్‌ ట్సే, యెల్లో రివర్‌ వంటి నదులు పుడుతున్నాయి. అవి భారత్‌, చైనా, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మియన్మార్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, కంబోడియా, లావోస్‌ దేశాలకు ప్రాణాధారాలు. ఈ నదుల చెంతనే వేల ఏళ్ల నుంచి నాగరికతలు పరిఢవిల్లాయి. ఆ నదులన్నింటికీ పుట్టినిల్లయిన టిబెట్‌ను చైనా కబ్జా చేసినా ఏ ఒక్క దేశమూ కిమ్మనకపోవడమే అసలు సమస్య!

ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన బౌద్ధమతం టిబెట్‌లో నేటికీ సజీవంగా ఉంది. మానస సరోవరం ఉన్నది ఆ దేశంలోనే! అది భారత్‌లో ఉందని చాలామంది పొరబడతారు. సారనాథ్‌, బుద్ధగయ, నలంద, అమరావతి వంటి పవిత్ర స్థలాల సందర్శనకు టిబెటన్లు వస్తుండేవారు. ప్రజలు స్వేచ్ఛగా అటూఇటూ తిరిగేవారు. ఇప్పుడు సరిహద్దులో భారత్‌, చైనా సేనలు మోహరించాయి. చైనా ఆక్రమణతో దలైలామా, లక్షమంది అనుయాయులతో టిబెట్‌ వదలి భారత్‌లో ఆశ్రయం పొందారు. దలైలామా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివసిస్తున్నారు. టిబెటన్‌ పార్లమెంటు, ప్రభుత్వం అక్కడే నెలకొన్నాయి. టిబెటన్ల దీర్ఘకాల స్వప్నమైన స్వాతంత్య్రం, భారత్‌ మౌనం వల్ల సాకారం కావడం లేదు. దలైలామా సైతం భారత్‌ విధానానికి అనుగుణంగా నడచుకొంటూ స్వయంప్రతిపత్తి డిమాండుతో సరిపెట్టుకుంటున్నారు. టిబెటన్లు అహింస, కారుణ్య భావనలకు కట్టుబడి ఉంటారు. ఆశయం కోసం ఆత్మాహుతి చేసుకుంటారే తప్ప చైనీయుల మీద పోరాటానికి దిగరు. 155 మంది టిబెటన్‌ కుర్రాళ్లు ఈ విధంగా ప్రాణాలు అర్పించారు. వారి ఆత్మాహుతి వీడియోలు హృదయాన్ని కలచివేస్తాయి. చైనా పదఘట్టనల కింద టిబెటన్లు నలిగిపోతున్నా పట్టించుకోని 160 దేశాలు చైనాతో వ్యాపారం సాగిస్తున్నాయి. టిబెట్‌లో దలైలామా ఫొటోను దగ్గర ఉంచుకోవడమూ నేరమే. జాతీయ జెండాను పట్టుకున్నా కఠినంగా శిక్షిస్తారు. చైనీయులు సైతం ఒకప్పుడు బౌద్ధం, కన్‌ఫ్యూషియనిజం సూత్రాలకు అనుగుణంగా జీవించేవారు. ఇప్పుడక్కడ ఉన్నది ఒకే మతం. అది కమ్యూనిజం కూడా కాదు- డబ్బు, వస్తువ్యామోహం, వినియోగం!

భారతదేశమే స్ఫూర్తి..

యువ టిబెటన్లు రెండు వందల సంవత్సరాల భారత స్వాతంత్య్ర పోరాటం నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. 1942 వరకు స్వాతంత్య్రం వస్తుందన్న బలమైన నమ్మకం భారతీయులకు ఉండేది కాదు. టిబెట్‌నే కాకుండా ముస్లిం దేశమైన తూర్పు తుర్కిస్థాన్‌నూ 1949లో చైనా ఆక్రమించింది. దక్షిణ మంగోలియా, మంచూరియాలనూ కబ్జా చేసింది. ప్రస్తుతం 96 లక్షల చదరపు కిలోమీటర్ల చైనా వైశాల్యంలో 60 శాతం ఆక్రమించుకున్న దేశాలకు చెందినదే. చైనా విస్తరణ కాంక్షకు అడ్డుతగులుతున్న అతికొద్ది దేశాల్లో భారత్‌ ఒకటి. చైనా పేరుకే కమ్యూనిస్టు దేశం. వాస్తవానికి అదెన్నడో పెట్టుబడిదారీ దేశంగా మారిపోయింది. భారత్‌ ఇకనైనా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని బహిరంగంగా సమర్థించాలి. ఐక్యరాజ్య సమితి సహా అన్ని అంతర్జాతీయ వేదికలపై టిబెట్‌ స్వేచ్ఛావాణికి మద్దతుగా నిలవాలి. సమితిలో పాలస్తీనాకు ఉన్నట్లే టిబెట్‌కూ పరిశీలక హోదా ఇవ్వాలి. భారతదేశం కనుక టిబెట్‌కు అండగా నిలిస్తే ఆసియాలో, ప్రపంచంలో గొప్ప ప్రభావం కనిపిస్తుంది. చైనా సరిహద్దును టిబెట్‌ సరిహద్దుగా గుర్తించడం భారత్‌ ముందుగా చేయాల్సిన పని! దలైలామాను టిబెట్‌ అధినేతగా ప్రకటించి, ఆయనకు భారతరత్న పురస్కారం అందజేయాలి!

-సందీప్ పాండే, రచయిత- రామన్ మెగసెసే పురస్కార గ్రహీత

ఇదీ చదవండి: 'మాతృభాషలో విద్యాబోధనతోనే మానసిక వికాసం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.