ETV Bharat / international

మార్స్​పై విజయవంతంగా చైనా తొలి ప్రయోగం

author img

By

Published : Jul 23, 2020, 1:52 PM IST

Updated : Jul 23, 2020, 2:05 PM IST

అంగారక గ్రహంపై తన తొలి ప్రయోగాన్ని చైనా విజయవంతంగా ప్రారంభించింది. మార్స్​పై తియన్​వెన్​-1 పేరుతో మిషన్​ను పంపింది. ఈ మిషన్​ ద్వారా మార్స్​పై గురుత్వాకర్షణ వంటి అంశాలను అధ్యయనం చేయనుంది.

China launches first Mars mission
అంగారకుడిపై తొలి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించిన చైనా

చైనా.. మార్స్ (అంగారక గ్రహం)​పై తన తొలి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది. తియన్​వెన్​-1(క్యూయెస్ట్​ ఫర్ హెవెన్లీ ట్రూత్​-1) పేరుతో ఈ మార్స్​ మిషన్​ను హైనాన్ రాష్ట్రంలోని వెన్​చాంగ్​ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నింగిలోకి పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మిషన్​ ప్రారంభమైన 36 నిమిషాలకు.. భూమి నుంచి అంగారకుడికి బదిలీ చేసే కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చైనా జాతీయ అంతరిక్ష పాలనావిభాగం (సీఎన్​ఎస్​ఏ) తెలిపింది.

మార్స్​పై విజయవంతంగా చైనా తొలి ప్రయోగం

భౌగోళిక దర్యాప్తే లక్ష్యంగా..

రెడ్​ ప్లానెట్​పై సమగ్ర పరిశీలన, మార్టియన్​ నేలపై ల్యాండింగ్​, ల్యాండ్​ అయిన పరిసర ప్రాంతాలలో తిరిగేందుకు అనుగుణంగా రోవర్​ను పంపించింది. అంతేకాకుండా అక్కడి ఉపరితలంపై శాస్త్రీయ దర్యాప్తు, భౌగోళిక నిర్మాణం, పర్యావరణం, వాతావరణ పరిస్థితులతో సహా.. నీటి జాడ వంటి తదితర అంశాలపై పరిశోధనలు చేస్తుందని స్థానిక మీడియా పేర్కొంది.

ఏడు నెలలు..

తియన్​వెన్ -1.. అంగారక గ్రహాన్ని చేరుకునేందుకు 7 నెలల పాటు ప్రయాణం చేస్తుంది. ఇందులో ఆర్బిటర్, రోవర్, ల్యాండర్ వంటి మూడు భాగాలుంటాయి. అంగారక కక్ష్యలోకి చేరుకున్న తర్వాత ల్యాండర్, రోవర్​ విడిపోతాయని.. అయితే ఆర్బిటర్​ మాత్రం కక్ష్యలోనే ఉంటుందని చైనా స్పష్టం చేసింది.

రష్యా సహకారంతో చైనా 2011లోనే అంగారక యాత్ర చేపట్టినప్పటికీ ఆ ప్రయోగం విఫలమైంది.

ఇదీ చదవండి: అనుచిత సంబంధం కేసులో మంత్రిపై ప్రధాని వేటు

Last Updated : Jul 23, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.