ETV Bharat / international

అధ్యక్ష పోరుపై చైనా దృష్టి- బైడెన్​ పైనే ఆశలు.!

author img

By

Published : Oct 23, 2020, 4:38 PM IST

కరోనా వ్యాప్తికి చైనాయే కారణమని మండిపడుతోన్న డొనాల్డ్ ట్రంప్​​ కారణంగా అమెరికాతో చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. చైనాపై చర్యలు తప్పవని పలుమార్లు హెచ్చరించారు ట్రంప్​. ఈ నేపథ్యంలో ట్రంప్​నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న చైనా.. ఆయన అభ్యర్థి జో బైడెన్​పై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. డెమొక్రాట్​ అభ్యర్థి బైడెన్‌ గెలిస్తేనే పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చే అవకాశముందని చైనా నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

China hopes for change if Biden wins
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్​ పైనే చైనా ఆశలు.!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలో చైనాతో సంబంధాలు ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. కరోనా వైరస్‌ ప్రభావం తర్వాత చైనా తీరుపై మరింత స్వరం పెంచిన ట్రంప్‌.. ఆ దేశంపై చర్యలు తప్పవని సమయం దొరికినప్పుడల్లా స్పష్టం చేస్తూనే ఉన్నారు. చైనాతో స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో ఒబామా ప్రభుత్వ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్‌ కీలకంగా వ్యవహరించినట్లు అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలోనూ ట్రంప్‌ ఆరోపించారు. అంతేకాకుండా తాను మళ్లీ అధికారంలోకి వస్తే చైనాపై మరిన్ని చర్యలు తప్పవని తాజా ఇంటర్వూలోనూ హెచ్చరించారు ట్రంప్‌. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రత్యర్థి బైడెన్‌పైనే చైనా నేతలు ఆశలు పెట్టుకున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

చైనాపై గుర్రుగా..

కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా అమెరికా-చైనా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కరోనా విషయంతోపాటు వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ విషయాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఇప్పటికే చైనీయుల వీసాలపై ఆంక్షలు విధిస్తుండటం సహా.. టెక్నాలజీ దిగ్గజం హువావే కూడా అమెరికా నుంచి తరలిపోవడంలో ట్రంప్‌ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. చైనా సామాజిక మాధ్యమాలపైనా కొరడా ఝులిపిస్తోంది అగ్రరాజ్యం. అటు హాంగ్‌కాంగ్‌, తైవాన్‌, షిన్‌ జియాంగ్‌, టిబెట్‌ ప్రాంతాల్లో జరుగుతోన్న చైనా ఆకృత్యాలపై కూడా అమెరికా మండిపడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరికొన్ని రోజుల్లో ఏర్పడబోయే అమెరికా కొత్త ప్రభుత్వం చైనాపై ఎలా వ్యవహరిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.

అమెరికన్లలో పెరిగిన చైనా వ్యతిరేక భావన..

అయితే.. ఎక్కువమంది అమెరికన్లు చైనా తీరుపై వ్యతిరేకంగానే ఉన్నట్లు నివేదికలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రెండో వంతు అమెరికన్లు చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నట్లు తాజాగా విడుదలైన పీఈడబ్ల్యూ పరిశోధన కేంద్రం నివేదిక స్పష్టంచేసింది. ఈస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారని నిపుణులు పేర్కొన్నారు.

రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ పార్టీలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ చైనాపై వస్తోన్న ఫిర్యాదులను తక్కువ చేసి చూపితే అది బైడెన్‌కే ముప్పుగా మరే అవకాశం ఉంటుందని వాషింగ్టన్‌ కేంద్రంగా ఉన్న అమెరికన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇనిస్టిట్యూట్‌ నిపుణులు డెరెక్‌ సీసర్స్‌ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌ అధ్యక్షుడిగా ఉంటే మాత్రం చైనాతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు భావించారు. ముఖ్యంగా బైడెన్‌ విధానాలు ట్రంప్‌ మాదిరిగా హాస్యాస్పదంగా, భావోద్వేగంగా మాత్రం ఉండవని చైనాకు చెందిన అంతర్జాతీయ వ్యవహార నిపుణులు యూ వాన్‌లీ అభిప్రాయపడ్డారు. డెమొక్రాట్లు మిలిటెంట్‌ భావన తక్కువ కలిగి ఉంటారు. దీంతో సైనిక సంఘర్షణలను, సంక్షోభం నుంచి బయటపడే మార్గాలపై శ్రద్ధ చూపే ఆస్కారం ఉంటుందని బీజింగ్‌లోని రెన్‌మిన్‌ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు సృ యిన్‌హాంగ్‌ పేర్కొన్నారు.

నిరూపించాల్సిందే.!

బైడెన్‌ అధికారంలోకి వస్తేనే అమెరికాలో చైనా వస్తువులపై టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గే ఆస్కారం ఉంటుందని యురేసియా గ్రూప్‌ పరిశోధన సంస్థకు చెందిన మైఖేల్‌ హర్‌సన్‌ ఓ నివేదికలో పేర్కొన్నారు. వాతారవణ మార్పు‌, ఉత్తర కొరియా, ఇరాన్‌, కరోనా వైరస్‌ విషయంలోనూ బైడెన్‌ మాత్రమే చైనాతో సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే.. ఈ విషయాల్లో ట్రంప్‌ ప్రభుత్వ విధానాలు వైఫల్యం చెందినట్లు బైడెన్‌ నిరూపించాల్సి ఉంటుందని మైఖేల్‌ హర్‌సన్‌ అభిప్రాయపడ్డారు.

ఆయనపైనే ఆశలు..

ఇలా చైనాపై రాజకీయ ప్రతీకార చర్యలకు పాడుల్పతున్న సమయంలో డెమొక్రాట్ నేత జో బైడెన్‌ గెలిస్తే మాత్రం పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు చైనా నేతలు భావిస్తున్నారు. దీంతో బైడెన్‌ గెలుపుపైనే చైనా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ట్రంప్​ X బైడెన్​: కరోనా సన్నద్ధతపై వాడీవేడి చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.