అమెరికాపై జరిగిన సైబర్ దాడికి అసలు సూత్రధారి రష్యా కాదని.. చైనా అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను డ్రాగెన్ తప్పుపట్టింది. ఈ దాడి రష్యన్ హ్యాకర్ల పనేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పినప్పటికీ ట్రంప్ ఇలా మాట్లాడడం సరికాదని తెలిపింది. సైబర్ నేరాలను అణిచివేసే దిశగా చైనా అడుగులు వేస్తోందని స్పష్టం చేసింది.
"అమెరికాపై జరిగిన సైబర్ దాడికి మా దేశం కారణం అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదు. ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదు. అనవసర అరోపణలతో చైనాకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అగ్రరాజ్యం తన వైఖరి మార్చుకోవాలి. బాధ్యతాయుతంగా మెలగాలి."
-వాంగ్ వెన్బిన్