కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. దీంతో ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా విమానయానశాఖ తమ సిబ్బందికి 38 పేజీలతో కూడిన కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అందులో.. కరోనాను ఎదుర్కోవడానికి సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. ముఖ్యంగా సిబ్బంది డైపర్లు వాడాలని సూచించింది. కరోనా సోకే అవకాశం ఎక్కువ ఉన్న విమానాల్లో సిబ్బంది బాత్‌రూమ్‌లు వినియోగించొద్దని స్పష్టం చేసింది.
అలాగే 500లకు పైగా కొవిడ్-19 కేసులున్న దేశాలకు వెళ్లే విమానాల్లో ఈ నిబంధన తప్పనిసరి అని పేర్కొంది. సాధారణ విమానాలతోపాటు ఛార్టెడ్ విమానాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే రక్షణ మాస్కులు, చేతి తొడుగులు ధరించాలి. కళ్లద్దాలు పెట్టుకోవాలి. పీపీఈ కిట్లు, షూ కవర్లు ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటివల్ల విమానాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంటుదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:చైనాకు రాజ్నాథ్ పరోక్ష సందేశం