వినోద పరిశ్రమమై అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది చైనా కమ్యూనిస్టు పార్టీ. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ సంపద, విలాసాల గురించి గొప్పల చెప్పకుండా నిషేధం విధించింది. విపరీత ఆనందాన్ని కూడా వ్యక్తపరచకుండా ఆంక్షలు అమలు చేస్తోంది. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఈమేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది(china crackdown on celebrity culture).
ఈ నిబంధనల ప్రకారం సెలబ్రిటీలు తప్పుడు, వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయరాదు. ఇతర ఫ్యాన్స్ గ్రూప్‌లను రెచ్చగొట్టకూడదు. వదంతులను అస్సలు వ్యాప్తి చేయరాదు. ప్రముఖులు, వారి అభిమానులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలి(china celebrity culture).
వినోద పరిశ్రమపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, సెలబ్రిటీ సంప్రదాయానికి చెక్ పెట్టేందుకే చైనా ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో వినోద పరిశ్రమ సదస్సును నిర్వహించించి చైనా కమ్యూనిస్టు పార్టీ. ధనారాధన, మితిమీరిన వ్యక్తిగతవాదం, సుఖవాదం(Hedonism) వంటి వాటిని సెలబ్రిటీలు కచ్చితంగా వ్యతిరేకించాలని హెచ్చరించింది. 'పార్టీని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి, నైతికత, కళను సమర్థించండి' అనే నినాదాన్ని లేవనెత్తింది. సామాజిక విలువలు, వ్యక్తిగత నైతికత, కుటుంబ విలువలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని చెప్పింది(china celebrites latest news).
ఎందుకు అణచివేత?
సెలబ్రిటీ సంస్కృతి, సంపాదించాలనే అత్యాశ పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రమాదర అంశమని, కమ్యూనిజానికి దీని వల్ల ముప్పు ఉందని చైనా భావిస్తోంది. ఇవి సామూహికవాదాన్ని కాకుండా వ్యక్తిగతవాదాన్ని ప్రోత్సహిస్తాయని బలంగా విశ్వసిస్తోంది. అందుకే ప్రముఖుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది(china entertainment industry news).
అసభ్యంగా ప్రవర్తించే సెలబ్రిటీలు పేరుతో ఆగస్టులో చైనా కొంతమందిని బ్లాక్ లిస్టులో చేర్చిందని ప్రచారం జరిగింది. ఝావ్, జెంగ్ అనే అనే ఇద్దరు ప్రముఖుల పేర్లు ఇందులో ఉన్నట్లు సామాజిక మాద్యమాల్లో జోరుగా చర్చ సాగింది. రేప్ కేసులో అరెస్టయిన చైనీస్-కెనడియన్ పాప్ స్టార్ క్రిస్ వు పేరు కూడా ఇందులో ఉంది(china celebrity news ).
వీడియో గేమ్స్‌పైనా...
స్వలింగ సంపర్క సంబంధాలు, మగాళ్లను ఆడవారిగా చూపించడం వంటి సన్నివేశాలుండే వీడియో గేమ్‌లపై నిషేధం విధించేందుకు చైనా ప్రణాళికలు రూపొందించినట్లు గత నెలలో లీకైన ఓ మెమో ద్వారా వెల్లడైంది.
గేమ్స్‌ను చైనా ఇకపై కేవలం వినోదంలా చూడదని, సరైన విలువలు, చరిత్ర, సంస్కృతిని ప్రోత్సహించే ఓ కళగా మాత్రమే చూస్తుందని అధికారులు తెలిపారు(china entertainment news).
పిల్లలు వీడియో గేమ్స్‌కు బానిసలు కాకుండా నియంత్రించేందుకు ఆగస్టులో కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది చైనా. చిన్నారులు వారానికి మూడు గంటలు మాత్రమే వీడియో గేమ్స్ ఆడాలనే నిబంధనలను అమలు చేసింది. వీడియో గేమ్ కంపెనీలకు కూడా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
భారీ ఫైన్లు..
ట్యాక్స్ కట్టలేదనే కారణంతో ఓ ప్రముఖ టీవీ నటి జెంగ్ శువాంగ్కు 46 మిలియన్ డాలర్ల పన్ను విధించింది చైనా. ఆమెకు అవకాశాలు ఇవ్వొద్దని అధికారులు, నిర్మాతలకు ఆదేశాలిచ్చింది. ఓ తైవానీస్ సినిమాను రీమేక్ చేసిన ఈమె అనతికాలంతో విశేష ఆదరణ పొందింది. ఆ తర్వత పులు విజయవంతమైన సినిమాలు, సిరీస్‌లలో నటించింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఆమెపై కన్నేసి ఉంచింది. భారీగా సంపాదిస్తూ పన్ను ఎగవేసే వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది(chinese celebrity news 2021).
సినీ తార ఝావ్ వీకి సంబంధించిన రిఫరెన్స్ వీడియెలను కూడా స్ట్రీమింగ్ వెబ్సైట్ల నుంచి తొలగించింది చైనా ప్రభుత్వం. వీబోలో ఆమె ఫ్యాన్ పేజ్‌ను అకస్మాతుగా షట్ డౌన్ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు(china celebrity crackdown).
ఇదీ చదవండి: covid new variant: కరోనా కొత్త వేరియంట్.. డెల్టా కంటే ప్రమాదకరమా?