దక్షిణ ఫిలిప్పీన్స్ ద్వీపమైన మిండానావోలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.8గా తీవ్రత నమోదైంది. ఈ ఘటనలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఓ చిన్నారి మృతి చెందింది. దేశంలో గత మూడు నెలల్లో ఇదే అతి పెద్ద ప్రకృతి విపత్తని భౌగోళిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
బాధితులను రక్షించేందుకు సహాయక బృందం రంగంలోకి దిగింది. 24మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ప్రాంతాలకు తరలించారు అధికారులు.
దావావో నగర అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే భూకంపంలో చిక్కుకున్నా.. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
'రింగ్ ఆఫ్ ఫైర్'గా పిలిచే ఈ పసిఫిక్ మహా సముద్ర పరివాహాక ప్రాంతంలో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. అక్టోబరు నెలలో ఒకేసారి వారాల వ్యవధిలో మూడు ప్రకంపనలు సంభవించాయి. 6.6 తీవ్రతతో నమోదైన నాటి భూకంపంలో సుమారు 12మంది మృతి చెందారు.
ఇదీ చూడండి:మొహర్రం దృష్ట్యా కశ్మీర్లో మళ్లీ ఆంక్షలు..!