ETV Bharat / international

'చైనా వస్తువులు లేకుంటే మీరు బతకలేరు!'

భారత్​లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్​కు వ్యతిరేకంగా చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా వస్తువులు లేనిదే భారతీయులు జీవించలేరని వ్యాఖ్యానించింది. చైనాతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి భారత్​కు వంద కారణాలు ఉన్నాయని పేర్కొంది. భారత్​లోని చాలా స్టార్టప్​లలో చైనా పెట్టుబడులు ఉన్నాయని గుర్తు చేసింది.

Boycotting Chinese products will hurt India more: China daily
'చైనా వస్తువులు లేకుంటే భారతీయులు జీవించలేరు!'
author img

By

Published : Jun 22, 2020, 1:09 PM IST

Updated : Jun 22, 2020, 2:10 PM IST

భారత్​తో సరిహద్దులో ఘర్షణలకు ఆజ్యం పోస్తూ 20 మంది జవానులను పొట్టనబెట్టుకున్న చైనాకు వ్యతిరేకంగా దేశం మొత్తం 'చైనా వస్తువుల బహిష్కరణ' మంత్రం జపిస్తోంది. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చైనా అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ తీవ్రంగా స్పందించింది. చైనాలో తయారైన వస్తువులు లేని జీవనాన్ని భారతీయులు భరించలేరంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు పత్రికలో ఓ వ్యాఖ్యానం ప్రచురితమైంది.

ఇదీ చూడండి:భారత్​లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?

భారత్​కు చైనా అవసరం

గల్వాన్ లోయలో జరిగిన ఘటనను 'దురదృష్టకర ఘర్షణ'గా అభివర్ణించింది గ్లోబల్ టైమ్స్. దీన్ని చైనా పట్ల విద్వేషాన్ని రేకెత్తించేలా రాజకీయాలు, కుట్ర సిద్ధాంతాల కోసం ఉపయోగించుకోరాదని హితవు పలికింది. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి భారత్ ఆధారపడే అతిపెద్ద పొరుగు దేశం చైనానే అని వ్యాఖ్యానించింది. సరిహద్దులో శాంతి నెలకొంటేనే ఆసియాలో రెండు అతిపెద్ద దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మెరుగుపడి ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.

"తాజా సరిహద్దు ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా, ద్వైపాక్షిక సంబంధాలు దిగజారకుండా ఇరుదేశాలు శాయశక్తులా ప్రయత్నించాలి. భారత్​లోని చాలా మంది టీవీ వ్యాఖ్యాతలు, వార్తా పత్రికల విశ్లేషకులు సరిహద్దు ఘర్షణను మరింత పెంచుతున్నారు. కయ్యానికి కాలు దువ్వే విధంగా చైనాకు భారత్ గట్టి బదులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటితో భారతీయులు మోసపోరని అనుకుంటున్నాం. ఆర్థికంగా, రాజకీయ, భౌగోళికంగా భారత్​కు చైనా అవసరం."

-గ్లోబల్ టైమ్స్​ వ్యాఖ్యానం

భారత దేశానికి చైనా అనేక అవకాశాలను అందిస్తోందని వ్యాఖ్యానం పేర్కొంది. భారత్​లో ఉన్న టాప్-30 స్టార్టప్​లలోని 18 సంస్థల్లో చైనా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: 'బాయ్​కాట్ చైనా' సాధ్యమేనా? లాభదాయకమేనా?

"ఇళ్లలో రోజూ ఉపయోగించే కలర్ టీవీలు, మైక్రోవేవ్​ ఒవెన్​లు, ఏసీలు, ఫోన్లు, ల్యాప్​టాప్​లన్నింటినీ చైనాలోనే తయారు చేస్తున్నాం. అందుబాటు ధరల్లోనే ఈ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాం. చైనా ఉత్పత్తులను వేరే వాటితో భర్తీ చేసుకోవడం చాలా కష్టం."

-గ్లోబల్ టైమ్స్​ వ్యాఖ్యానం

ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతలను పెంచవద్దని భారత్​కు సూచించింది. చైనాతో పరస్పరం సంబంధాలు కొనసాగించడానికి న్యూదిల్లీకి వంద కారణాలు ఉన్నాయని పేర్కొంది.

బాయ్​కాట్ చైనా!

గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగిన తర్వాత దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలు చోట్ల చైనా టీవీలను ధ్వంసం చేశారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలని కేంద్ర మంత్రులు సైతం తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ద్వైపాక్షిక వాణిజ్యం

విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం భారత్- చైనా మధ్య 95.54 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. భారత ఎగుమతుల విలువ 18.84 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి- చైనా ఉత్పత్తులపై సదాలోచనే దిక్సూచి

భారత్​ నుంచి పత్తి, రాగి, వజ్రాలు, రత్నాలు వంటివి చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు యంత్రాలు, టెలికాం- విద్యుత్ సంబంధిత పరికరాలు, ఆర్గానిక్ రసాయనాలు, ఎరువులు చైనా భారత్​కు ఎగుమతి చేస్తోంది.

ఇదీ చదవండి- టపాసులు తిని మరో గజరాజు మృతి!

Last Updated : Jun 22, 2020, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.