ETV Bharat / international

పాక్​లో పేలుడు.. భారతీయ వస్తువులు అమ్మే మార్కెట్​ లక్ష్యంగా...

Blast in Lahore: పాకిస్థాన్​, లాహోర్​లోని ప్రముఖ అనార్కలీ మార్కెట్​లో భారతీయ వస్తువులు విక్రయించే ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

PAK-BLAST
భారత వస్తువులే లక్ష్యంగా పాక్​ మార్కెట్లో పేలుడు
author img

By

Published : Jan 20, 2022, 5:00 PM IST

Blast in Lahore: పాకిస్థాన్​, లాహోర్​లోని ప్రముఖ అనార్కలీ మార్కెట్​లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారతీయ వస్తువులు విక్రయించే ప్రాంతంలోని ఓ పాన్​ మండీ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు, భవనాల కిటికీలు పగిలిపోయినట్లు చెప్పారు.

" పేలుడు జరిగిన తీరును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. 20 మందికిపైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించాం. ముగ్గురు మృతి చెందారు. మోటార్​ సైకిల్​లో లేదా ఇతర ప్రాంతంలో టైమ్​ బాంబు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నాం. అయితే, అదేనని కచ్చితంగా చెప్పలేం. "

- డాక్టర్​ మోహమ్మద్​ అబిద్​, డిప్యూటీ ఐజీ.

ఉగ్రవాద నిరోధక, బాంబు నిర్వీర్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు అబిద్​. ఆసుపత్రిలో చేరిన వారిలో ఓ బాలుడు సహా మరో ఇద్దరు మృతి చెందారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి: స్టార్ సింగర్​ రాలేదని ఫ్యాన్స్ రచ్చ.. స్టేజీ ధ్వంసం, వాహనాలకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.