అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో భారీ పేలుడుకు పాల్పడ్డారు. అఫ్గాన్‌లోని తాలిబన్లతో చర్చలు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ ఘటన జరిగింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. దాడులపై ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు. అయితే.. తాలిబన్లేనని అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు.
అగ్రరాజ్యం అమెరికాను వణికించిన 9/11 దాడులు జరిగి సరిగ్గా 18 ఏళ్లు గడుస్తున్న వేళ ఈ పేలుడు జరగడం గమనార్హం.