ETV Bharat / international

బీజింగ్‌లో ఇక మాస్కులు అక్కరలేదట..!

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భౌతికదూరం పాటించటం సహా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే.. చైనా రాజధాని బీజింగ్​లో మాస్కులు లేకుండానే బయట తిరగవచ్చని అధికారులు వెల్లడించారు. వైరస్​కు మూలకారణమైన చైనాలో నిబంధనలు సడలించడానికి కారణమేంటి?

Beijing-residents-can-go-out-without-mask
బీజింగ్‌లో ఇక మాస్కులు అక్కరలేదట..!
author img

By

Published : Aug 21, 2020, 10:30 PM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఆయా దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ ముప్పు ఇప్పుడే తొలగిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అంతర్జాతీయంగా ఉన్న నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడంతోపాటు, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో.. వైరస్‌కు మూలకారణమైన చైనాలో మాత్రం నిబంధనలు సడలిస్తుండడం గమనార్హం. తాజాగా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కులపై ఉన్న నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. చైనా రాజధాని బీజింగ్‌లో మాస్కులు లేకుండానే ప్రజలు బయట తిరగవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇది రెండోసారి..

మాస్కులపై ఉన్న నిబంధనలను బీజింగ్‌ అధికారులు తొలగించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ నెలలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గడంతో మాస్కులు లేకుండా ప్రజలు బయటకు వెళ్లవచ్చని తొలిసారి ప్రకటించారు. అనంతరం మూడు నెలల తర్వాత ఓ హోల్‌సేల్‌ మార్కెట్‌ వైరస్‌వ్యాప్తికి కేంద్రంగా మారడంతో మాస్కులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా గడిచిన 13రోజుల నుంచి చైనా రాజధాని బీజింగ్‌లో కొత్తగా ఒక్కకేసు కూడా నమోదుకాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మాస్కులు అవసరం లేదని చెప్పినప్పటికీ ప్రజల మాస్కులతోనే బయటకు వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. మాస్కులు ధరించడం రక్షణగా ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం ఇతరుల ఒత్తిడితోనే మాస్కు ధరిస్తున్నట్లు చెబుతున్నారు.

89 వేల కేసులు..

కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఇప్పటివరకు 89,000కేసులు నమోదుకాగా 4700 మరణాలు సంభవించాయి. 31 దేశాల్లో కేసుల సంఖ్య చైనాకన్నా అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా, 7లక్షల 90వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: చైనా టీకా ధర రూ.10 వేలంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.