ETV Bharat / international

'వాషింగ్టన్‌ దాడి' ఓ అందమైన దృశ్యం: చైనా - క్యాపిటల్ భవనం విధ్వంసంపై చైనా

డొనాల్డ్ ట్రంప్ అనుచరులు వాషింగ్టన్​లోని క్యాపిటల్ భవనం వద్ద విధ్వంసం చేపట్టడాన్ని అందమైన దృశ్యంగా అభివర్ణించింది చైనా. హాంకాంగ్ అల్లర్లను సమర్థించి, వాషింగ్టన్ ఘటనను ఖండించడం ద్వారా ఐరోపా దేశాల నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించింది.

beautiful sight china reaction against us capitol chaos
'వాషింగ్టన్‌ దాడి' ఓ అందమైన దృశ్యం
author img

By

Published : Jan 7, 2021, 3:36 PM IST

ఎన్నికల్లో తమ నాయకుడి అపజయాన్ని సహించలేని ట్రంప్‌ వర్గీయులు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో నిరసనలకు దిగారు. ఇక్కడి క్యాపిటల్‌ భవనంలోకి చొరబడి విధ్వంసం చేయటమే కాకుండా ఆ దృశ్యాలను సెల్ఫీ తీసుకొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు.

కాగా, ఈ విషయమై చైనా భిన్నంగా స్పందించింది. ఈ ఉదంతాన్ని 'అందమైన దృశ్యం' అని అభివర్ణిస్తూ సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ప్రజాస్వామ్యానికి చేటు అని పలు ప్రపంచ దేశాలు ఈ ఘటనను ఖండించిన నేపథ్యంలో డ్రాగన్‌ ఈ విధంగా స్పందించింది. హాంకాంగ్‌ అల్లర్లను సమర్థించి, వాషింగ్టన్‌ ఘటనను ఖండించడం ద్వారా.. యూరోపియన్‌ దేశ నాయకులందరూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారంటూ ఆ పార్టీ విమర్శించింది.

ఆ ఘటనతో పోలుస్తూ..

హాంకాంగ్‌లో జులై 2019లో లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కాంప్లెక్స్‌ భవనంలో పలువురు నిరసనకారులు చొరబడి చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. దీనిని తాజా క్యాపిటల్‌ భవనం ఘటనతో పోలుస్తూ చైనా అధికారిక మీడియా సంస్థ 'గ్లోబల్‌ టైమ్స్' నేటి ఉదయం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును పెట్టింది.

  • .@SpeakerPelosi once referred to the Hong Kong riots as "a beautiful sight to behold" — it remains yet to be seen whether she will say the same about the recent developments in Capitol Hill. pic.twitter.com/91iXDzYpcO

    — Global Times (@globaltimesnews) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అమెరికా స్పీకర్‌ పెలోసీ ఒకప్పుడు హాంగ్‌కాంగ్‌ నిరసనలను అద్భుత దృశ్యంగా అభివర్ణించారు. ఇక క్యాపిటల్‌ భవనంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనపై కూడా ఆమె అదే విధంగా స్పందిస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది" అంటూ ట్వీట్‌ చేసింది.

అంతేకాకుండా ఆ దేశ అధికార కమ్యూనిస్టు పార్టీ యువజన విభాగం కూడా ఈ నిరసన ఘటనను అందమైన దృశ్యంగా అభివర్ణిస్తూ.. సామాజిక మాధ్యమం వైబోలో ఫొటోలను షేర్‌ చేసింది. కాగా, ఈ పోస్టును గంటల వ్యవధిలోనే 23 కోట్ల మంది వీక్షించారు.

ఇదీ చదవండి: ట్రంప్​ వర్గం రచ్చ- చరిత్రలో మాయని మచ్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.