మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి కీలక నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్. ఇకపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించనుంది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని కెబినేట్ ఆమోదించింది.
అత్యాచారానికి పాల్పడిన వారికి.. ప్రస్తుతం జీవిత ఖైదు అమల్లో ఉంది. మరణశిక్షగా మార్చుతూ.. అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'నేపాల్ సరిహద్దు భూములను ఆక్రమించిన చైనా'