ప్రయాణంలో ఏదోకటి మర్చి పోవడం సాధారణంగా జరుగుతునే ఉంటుంది. హడావిడిలో పర్సో, బ్యాగో మర్చిపోతుంటారు ప్రయాణికులు. కానీ ఓ మహిళ బిడ్డనే మర్చిపోయింది. సౌదీఅరేబియలోని జెడా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో ఏకంగా విమానమే తిరిగి వెనక్కొచ్చింది.
పైలట్.. ఎయిర్‌పోర్టు సిబ్బందితో రేడియోలో మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. సౌదీ అరేబియా జెడ్డాలోని అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఎయిర్‌పోర్టు వెయిటింగ్‌రూమ్‌లో బిడ్డను వదిలిపెట్టి విమానమెక్కింది. తీరా శిశువు లేదని తెలుసుకుని పైలట్‌కి ఫిర్యాదు చేసింది. ఆమె కోరిక మేరకు పైలట్ విమానాశ్రయాధికారులతో అనుమతి కోరుతూ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కోడుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పైలట్ ఈ విధంగా మాట్లాడారు..“ఓ ప్రయాణికురాలు తన బిడ్డను టెర్మినల్‌లో వదిలిపెట్టింది. ఫ్లైట్ ని వెనక్కి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వండి" ఈ మాటలకు స్పందించిన ఆపరేటర్ “సరే వెంటనే వెనక్కి రండి.. ఇలా జరగడం ఇదే తొలిసారి” అని అంటూ బదులిచ్చాడు