ETV Bharat / international

కుప్పకూలిన సైనిక హెలికాప్టర్- 14 మంది మృతి

author img

By

Published : Nov 30, 2021, 7:24 PM IST

Azerbaijan helicopter crash: సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ హెలికాప్టర్ అజర్​బైజాన్ సరిహద్దు రక్షణ విభాగానికి చెందినదని అధికారులు తెలిపారు.

azerbaijan helicopter crash telugu news
azerbaijan helicopter crash telugu news

Azerbaijan news: అజర్​బైజాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్ అజర్​బైజాన్ సరిహద్దు రక్షణ విభాగానికి చెందినదని అధికారులు తెలిపారు. గరేబాట్ ట్రైనింగ్ గ్రౌండ్​ మీదుగా ఎగురుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. దీనిపై ఆ దేశానికి చెందిన రెండు దర్యాప్తు బృందాలు విచారణ ముమ్మరం చేశాయి.

అజర్​బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి: జైలుపై మిలిటెంట్ల దాడి- 11 మంది మృతి, ఖైదీల పరార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.