అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ జూ వాతావరణం.. ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటివరకు పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న పర్యటకులు.. ఒక్కసారిగా ఒకరిపై ఒకరు మీద పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ ఘటనతో పక్కనే ఉన్న ఇతర పర్యటకులూ షాక్‌కు గురయ్యారు. చివరికి అక్కడే ఉన్న కొన్ని జంతువులు కూడా వారి ఘర్షణను చూస్తూ ఉండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఇదీ జరిగింది..
చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున జూలోని జంతువులను చూసేందుకు వెళ్లారు. ఇంతలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ రెండు కుటుంబాలు తీవ్రస్థాయిలో కొట్టుకునేలా చేసింది. ఆరుగురు వ్యక్తులు చేతులు, కాళ్లతో దారుణంగా కొట్టుకున్నారు.
ఈ ఘర్షణలో భాగంగా మహిళలు.. ఒకరికొకరు జుట్టులు పట్టుకుని, నేల మీద ఈడ్చుకుంటూ కాళ్లతో కొట్టుక్కున్నారు. చుట్టుపక్కన ఉన్న ప్రజలు ఈ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యాలను ఇతరులు ఫోన్లలో చిత్రీకరించారు. అది కాస్త చైనా సామాజిక మాధ్యమం వైబోలో వైరల్‌గా మారింది.
చివరికి జూలోని భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. అయితే గొడవకు గల కారణాలు తెలియలేదు.
-
This biffo at the Beijing wild animal zoo between a couple of families prompted a statement from the zoo. It said the fighting left a deep impression on some nearby animals who copied the humans and had to be taught by staff that fighting isn’t good behaviour. 笑死我了😂 pic.twitter.com/3X9KcsmSCR
— Bill Birtles (@billbirtles) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">This biffo at the Beijing wild animal zoo between a couple of families prompted a statement from the zoo. It said the fighting left a deep impression on some nearby animals who copied the humans and had to be taught by staff that fighting isn’t good behaviour. 笑死我了😂 pic.twitter.com/3X9KcsmSCR
— Bill Birtles (@billbirtles) August 8, 2021This biffo at the Beijing wild animal zoo between a couple of families prompted a statement from the zoo. It said the fighting left a deep impression on some nearby animals who copied the humans and had to be taught by staff that fighting isn’t good behaviour. 笑死我了😂 pic.twitter.com/3X9KcsmSCR
— Bill Birtles (@billbirtles) August 8, 2021
జంతువులపై ప్రభావం..
ఈ గొడవను.. అక్కడే ఉన్న పర్యటకులు, చివరికి జంతువులు కూడా నిలబడి చూస్తూ ఉండిపోయాయని జూ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జంతువులపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. మనుషులను అనుసరిస్తూ.. జంతువులు కూడా రాత్రి ఒకదానిపై మరొకటి గొడవకి దిగినట్టు తెలిపింది. ఈ పూర్తి ఘటనపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలా గొడవపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ కోతి సోకులకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్