ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీనే మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ సంకీర్ణం మెజారిటీ స్థానాలు గెలుచుకోనుందని జాతీయ ప్రసారదారు ఏబీసీ సర్వే వెల్లడించింది.
151 సీట్లున్న ప్రతినిధుల సభ( హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రభుత్వ ఏర్పాటుకు 76 స్థానాలు అవసరం. ఇంతకంటే ఒక స్థానం ఎక్కువగా నెగ్గి.. అధికార పార్టీనే సొంతంగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు ఏబీసీ రాజకీయ విశ్లేషకులు.
సెనేట్‌లో మద్దతు కోసం...
అయితే... ఎగువసభ సెనేట్‌లో సంకీర్ణానికి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది ఏబీసీ. ఈ తరుణంలో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలి.
విశాల ద్వీపఖండంలో కొన్ని చోట్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ వారం అనంతరం ఆస్ట్రేలియా ఎన్నికల కమిషన్.. అధికారిక వివరాలు వెల్లడించే అవకాశముంది.
మోరిసన్‌కు ఇప్పుడే అతి పెద్ద సవాల్ ఎదురుకానుంది. చాలా మంది మంత్రులు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాల్లోనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కేబినెట్ ఏర్పాటు మోరిసన్‌కు క్లిష్ట పరిస్థితుల్ని తెచ్చిపెట్టింది.
ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికలు శనివారం ముగిశాయి. అయితే... ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ అధికార లిబరల్-నేషనల్ సంకీర్ణం విజయం దాదాపు ఖాయమైంది. ఎన్నికల అనంతరం ఓటమిని అంగీకరించిన ప్రతిపక్ష నేత బిల్ షార్టెన్ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ లేబర్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.
ఇదీ చూడండి: