ETV Bharat / international

కొవిడ్​ టీకాతో హెచ్​ఐవీ యాంటీబాడీలు - కొవిడ్​-19 వ్యాక్సిన్​ ట్రయల్స్

ఆస్ట్రేలియాలో కొవిడ్​ టీకాతో హెచ్​ఐవీ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్న కారణంగా క్వీన్స్​​లాండ్​ వర్సిటీ, సీఎస్​ఎల్​ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ నిలిచిపోయాయి. అయితే.. తమ టీకా వేసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వెల్లడించింది సంస్థ. టీకా ద్వారా హెచ్​ఐవీ సోకే అవకాశమే లేదని స్పష్టం చేసింది.

Corona vaccine
కొవిడ్ టీకా​ ట్రయల్స్​కు బ్రేక్​
author img

By

Published : Dec 11, 2020, 1:38 PM IST

ఆస్ట్రేలియాలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ ట్రయల్స్​కు బ్రేక్​ పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ ట్రయల్స్​లో పాల్గొన్న పలువురిలో హెచ్​ఐవీ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతుండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే టీకా ట్రయల్స్​ను నిలిపివేసినట్లు ఫార్మా సంస్థ ప్రకటించింది.

ఆస్ట్రేలియా క్వీన్స్​లాండ్​ విశ్వవిద్యాలయం, ఫార్మా సంస్థ సీఎస్​ఎల్​ సంయుక్తంగా 'వీ451' అనే కొవిడ్​-19 టీకాను అభివృద్ధి చేశాయి. తొలి దశ ట్రయల్స్​ నిర్వహిస్తూ 2,3 దశల క్లినికల్​ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న క్రమంలో అవాంతరం ఎదురైంది.

" క్లినికల్​ ట్రయల్స్​లో పాల్గొన్న 216 మందిలో ఎవరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదు. అది వ్యాక్సిన్​కు బలమైన భద్రతా సామర్థ్యం ఉన్నట్లు తెలియచేస్తోంది. ఈ వ్యాక్సిన్​ ద్వారా కొంత మందిలో హెచ్​ఐవీ ప్రోటీన్​ (జీపీ41)కు సంబంధించిన యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలుస్తోంది . అది హెచ్​ఐవీ పరీక్షల్లో తప్పుడు పాజిటివ్​ ఫలితాలు వచ్చేందుకు దారితీస్తోంది. ఆ తర్వాత సాధారణ పరీక్షల్లో హెచ్​ఐవీ లేదని తేలుతోంది. హెచ్​ఐవీ సోకేందుకు వ్యాక్సిన్​ కారణమయ్యే అవకాశమే లేదు. "

- సీఎస్​ఎల్​ బయోటెక్​.

టీకా ట్రయల్స్​ ప్రారంభానికి ముందే ఇందులో పాల్గొనే వలంటీర్లకు వ్యాక్సిన్​ హెచ్​ఐవీ ప్రోటీన్​ కాంపోనెంట్​కు సంబంధించి రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలియజేసినట్లు వెల్లడించింది సీఎస్​ఎల్​. అయితే.. ఆశ్చర్యకరంగా యాంటీబాడీల స్థాయిలు పెరిగి హెచ్​ఐవీ పరీక్షలపై ప్రభావం చూపుతోందని వెల్లడించింది.

అనవసర తొందరపాటుతో కాదు..

వ్యాక్సిన్​ ట్రయల్స్​ను నిలిపివేయటం.. ప్రభుత్వం, పరిశోధకులు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారని తెలియచెబుతోందన్నారు ప్రధాని స్కాట్​ మారిసన్​. 'ఈ రోజు ఎదురైన సమస్య ప్రభుత్వానికి ఆశ్చర్యకరమేమీ కాదు. మేము వేగంగా సాగుతున్నాం కానీ, అనవసరమైన తొందరపాటుతో కాదు. వ్యవస్థ ఎప్పటిలాగే పనిచేస్తుంది. ఆస్ట్రేలియన్లు సురక్షితంగా ఉంటారు.' అని పేర్కొన్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా కొనుగోలు చేయాలనుకున్న నాలుగు వ్యాక్సిన్లలో సీఎస్​ఎల్​- టీకా ఒకటి. ఇప్పటికే 51 మిలియన్​ డోస్​ల కోసం ఒప్పందాలు చేసుకుంది.

ఇదీ చూడండి:'ఆక్స్​ఫర్డ్ టీకా ట్రయల్స్​ ఆపొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.