ETV Bharat / international

ఆస్ట్రేలియాను ఆశ్చర్యపరిచిన చంద్రయాన్​-2..! - యూఎఫ్ఓ

వెలుగులు జిమ్ముతూ నింగికెగిరిన చంద్రయాన్​-2ను చూసిన ఆస్ట్రేలియన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో రాత్రి కావటం వల్ల భారీగా వెలుగు రావటాన్ని గమనించిన అక్కడి ప్రజలు.. గ్రహ శకలమో లేదా యూఎఫ్​ఓ తమ వైపు వస్తోందని కొంతమేర ఆందోళన పడ్డారు.

చంద్రయాన్​-2
author img

By

Published : Jul 24, 2019, 5:12 AM IST

ఆస్ట్రేలియాను ఆశ్చర్యపరిచిన చంద్రయాన్​-2 వెలుగులు

భారత కీర్తిపతాకను అంతర్జాతీయంగా రెపరెపలాడించింది చంద్రయాన్-2 ప్రయోగం. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నింగికెగిరింది జీఎస్​ఎల్వీ వాహకనౌక. అదే సమయంలో ఆస్ట్రేలియాలో రాత్రి కావటం వల్ల చంద్రయాన్-2 అక్కడి గగనతలంలో వెలుగులు చిమ్ముతూ ప్రయాణించడం కనిపించింది. గ్రహ శకలం లేదా యూఎఫ్​ఓ (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) వస్తోందని కొంతమేర ఆందోళన పడ్డారు కంగారూలు. చివరికి తెలుసుకుని ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విషయమై ఆస్ట్రేలియా న్యూస్ ఛానల్‌తో మెకిన్లే షైర్ కౌన్సిలర్ మాట్లాడారు.

"ఆ సమయంలో కారవాన్ పార్క్‌లో 160 మంది వరకూ ఉన్నారు. ఆకాశంలో కాంతివంతమైన వెలుగు కనిపించటం వల్ల అందరూ పైకి చూశారు. మూడు నిమిషాల తర్వాత అది మాయమయింది. అదేమిటో అక్కడున్నవారికి అర్థం కాలేదు. చాలా భిన్నంగా ఉంది."

- మెకిన్లే షైర్​ కౌన్సిలర్​

చాలా మంది ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఏమై ఉంటుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది కచ్చితంగా చంద్రయాన్​-2 వెలుగులేనని ఓ అంతరిక్ష నిపుణుడు చెప్పగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి: విజయం: చంద్రయాన్​-2 ఆరంభం మాత్రమే..

Khunti (Jharkhand), Jul 23 (ANI): A Bharatiya Janata Party (BJP) worker Mago Munda, along with his wife and son, was shot dead by unidentified assailants at their house in Jharkhand's Khunti. The incident took place last night in Hethegowa village of Khunti. Police is investigating the case. "The killing of the BJP worker is a great loss to the party. We condemn this incident," said Nilkanth Singh, Jharkhand's Rural Development Minister.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.