మహమ్మారి కరోనా వ్యాప్తి ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పటికీ కొవిడ్‌కు వ్యాక్సిన్ రాలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన అట్లేషియన్ ఐటీ కంపెనీ... భారత్‌లో ఎంతమంది ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారనే దానిపై ఓ సర్వే నిర్వహించింది.
సర్వేలో వెల్లడైన అంశాలు ఇవే..
- కొవిడ్‌కు వ్యాక్సిన్ రాకపోవడం వల్ల ఆఫీసుకు వెళ్లి పనిచేయడానికి 83శాతం ఉద్యోగులు సుముఖంగా లేరు.
- అయితే తిరిగి ఆఫీసుకెళ్లి పనిచేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను తమ కంపెనీలు చేసినట్లు 88శాతం ఉద్యోగులు భావిస్తున్నారు.
- కరోనా సాకుతో వర్క్‌ఫ్రమ్‌హోం ఇవ్వడంపై 78శాతం మంది కోపంగా ఉన్నారు.
- 86 శాతం మంది తమ బృందంలోని సభ్యులతో సంబంధాలు మెరుగుపడ్డాయని భావిస్తున్నారు.
- 75 శాతం మంది తమ జట్టు.. కరోనా ముందుతో పోలిస్తే బాగా కలిసి పనిచేస్తోందని అనుకుంటున్నారు.
- కరోనా కారణంగా షిఫ్ట్ వారీగా పని చేయడం వల్ల ఉత్పాదకత, పని సామర్థ్యం కూడా పెరిగినట్లు మేనేజర్లు భావిస్తున్నారు.
కొవిడ్-19 ముందుకంటే ప్రస్తుతం తమ ఉద్యోగాలకు భద్రత పెరిగిందని మేనేజర్ స్థాయి వారు పేర్కొన్నారని అట్లేషియన్ ఐటీ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ఇదీ చూడండి: రణరంగంలా పార్లమెంట్- పంది మాంసంతో దాడులు