ETV Bharat / international

Afghan News: ఆ రిపోర్టర్​ను తాలిబన్లు కొట్టి చంపారా? - తాలిబన్ల చేతుల్లో జర్నలిస్టు మృతి

తాలిబన్ల చేతుల్లో అఫ్గానిస్థాన్​కు(Afghan News) చెందిన వార్తా సంస్థ 'టోలో న్యూస్'(Tolo News) పాత్రికేయుడు జియార్ యాద్ ఖాన్​ మరణించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. నిజంగానే తాలిబన్లు జియార్​ను చంపేశారా? జియార్​కు అసలేమైంది?

TOLO News reporter
టోలో న్యూస్ పాత్రికేయుడు జియార్ యాద్ ఖాన్​
author img

By

Published : Aug 26, 2021, 1:16 PM IST

అఫ్గాన్​లో(Afghan News) తాలిబన్ల చేతుల్లో టోలో న్యూస్​(Tolo News) పాత్రికేయుడు​ జియార్ యాద్​ ఖాన్​ మరణించారనే వార్తలు కాసేపు కలకలం రేపాయి. జియార్ ఖాన్ పనిచేసే టోలో న్యూస్ కూడా ఈ వార్తా కథనాన్ని వెలువరించింది. అయితే... తాను మరణించలేదని, ఆ వార్తలు అవాస్తవాలని జియార్​ ఖానే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. దాంతో ఆయన మృతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. అయితే.. తనను తాలిబన్లు తీవ్రంగా కొట్టారని చెప్పారు జియార్​.

ziar yaad khan tolo news
జియార్ యాద్ ఖాన్​ ట్వీట్​

"రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో నన్ను తాలిబన్లు కొట్టారు. నా వద్ద ఉన్న కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను లాక్కున్నారు. నా ఫోన్​కుడా వాళ్లు తీసుకున్నారు. నేను చనిపోయినట్లుగా కొద్ది మంది వ్యాప్తి చేస్తున్న వార్తలు అవాస్తవాలు. తాలిబన్లు నా పైకి తపాకీ గురిపెట్టి కొట్టారు."

-జియార్ యాద్ ఖాన్​, టోలో న్యూస్ రిపోర్టర్​

అప్గానిస్థాన్​లో తొలి స్వతంత్ర వార్తా సంస్థ 'టోలో న్యూస్' కావడం గమనార్హం.

జులై 16న రాయిటర్స్​ వార్తా సంస్థకు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్​ అవార్డు గ్రహీత డానిష్​ సిద్దిఖీని అఫ్గాన్​లోని తాలిబన్లు (Taliban Afghanistan) చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.

ఇదీ చూడండి: తాలిబన్ల అంతు చూస్తాం.. 'పంజ్​షేర్'​ తాజా ప్రకటన!

ఇదీ చూడండి: Malala : 'నాపై ఒక్క తూటానే.. అఫ్గానీలపై లక్షల బుల్లెట్ల వర్షం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.